హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో మంత్రి రోజా యూటర్న్.. అప్పుడలా..? ఇప్పుడిలా..?

Roja on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో మంత్రి రోజా యూటర్న్.. అప్పుడలా..? ఇప్పుడిలా..?

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

Minister Roja on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు తండ్రిలాంటి వాడు అన్నారు మొన్నటి వరకు మంత్రి రోజా.. కానీ ఇప్పుడు ఆంధ్రుల ద్రోహి అంటూ తిడుతున్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసి.. ఇప్పుడు ఎందుకు ఏపీలో అడుగుగుపెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

Minister Roja on CM KCR:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) హీట్ ఇంకా చెల్లారలేదు. త్వరలోనే పూర్తి కార్యలాపాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలక నేతలు గులాబీ కండువా కప్పుకోగా.. పండుగ తరువాత  మరిన్ని వలసలు ఉంటాయి అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా (Minister Roja) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తన తండ్రిగా  భావిస్తున్నాను అన్నారు. ఈ మాటలు ఎవరో చెప్పనవి కాదు. కేసీఆర్ తిరుమలేశుని దర్శించుకుని కొండ దిగగానే రోజా.. తన ఇంటికి తీసుకెళ్లి మరీ కేసీఆర్ ఫ్యామిలీకి భోజనాలు పెట్టారు. కేసీఆర్ తన తండ్రిలాంటి వాడని రోజా సెలవిచ్చారు.

అయితే సరిగ్గా ఏడాది తిరిగే సరికే రోజా నాలుక మడతేశారు. రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అనేందుకు రోజా తాజా విమర్శలే నిదర్శనం అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ తన తండ్రిలాంటి వాడని నెత్తికెత్తుకున్న రోజా..  ఇప్పుడు ఆ తండ్రిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రాన్ని అన్యాయంగా రాజధాని లేకుండా ముక్కలు చేసి, నేడు ఏ ముఖం పెట్టుకుని ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయడానికి వస్తాడంటూ రోజా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎక్కడో కాదు సాక్షాత్తూ తిరుమల వెంకటేశుని సన్నిధిలోనే మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేయడంతో విలేకరులు ఖంగుతిన్నారు. రోజా ఏంటి ఇలా మాటమార్చేశారని.

ఇదీ చదవండి : పండుగ కోసం ప్రారంభమైన ప్రత్యేక బస్సులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

ఆ విషయంపై క్లారిటీ తీసుకోవాలని మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుంటే.. ఆమె అక్కడ నుంచి వెను తిరిగారు. అయితే కేసీఆర్ విషయంలో వైసీపీ స్టాండ్ ను మాత్రమే రోజా చెబుతూ ఉండొచ్చు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ డైరెక్షన్ లోనే మాట్లాడాల్సి ఉంటుంది.. అందుకే రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్ మాడుతారా అంటూ ఎస్ఐ నుంచి వార్నింగ్.. చివరికి అసలు విషయం తెలిసి షాక్

ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూటమిగా  ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకం అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వారు గెలిచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఏపీకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ నిరుద్యోగులందరినీ ఆ పార్టీలో చేర్పించి కనీసం 6 శాతం ఓట్లు సాధించి పెట్టాలని జగన్ రెడ్డి ప్రయత్నాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకలు.. ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ , ఏపీ జనాల మధ్య మళ్లీ అగ్గి రాజేసి చలి కాచుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్..! టీడీపీ వ్యూహం ఏంటి..?

ఏపీ, తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులు కాదు. రాజకీయ నాయకులు రోజుకొక మాట చెబితే విని  ఓట్లేయడానికి జనం సిద్దంగా లేరుని ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇక మంత్రి రోజా కేసీఆర్ పై చేసిన విమర్శలు ఆమె బుర్ర నుంచి వచ్చినవి కాదని వైసీపీ అధిష్ఠానం రాసిచ్చిన స్క్రిప్టు చదవడంతో రోజా పని అయిపోయిందని తెలుస్తోంది. ఎలాగైనా జనాలను రెచ్చగొట్టడంలో భాగంగానే రోజా కేసీఆరుపై ఈ విమర్శలు చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, BRS, KCR New Party, Minister Roja, Ycp

ఉత్తమ కథలు