Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి కూడా.. ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అధికార పార్టీ నేతలు, మంత్రులు అంతే దీటుగా బదులిస్తున్నారు. విమర్శలు చేసే విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ అయితే మంత్రి రోజా తనదైన స్టైల్లో పంచ్ లు వేయడంలో ముందుంటారు. అయితే ఈ సారి మరిత దూకుడుగా విపక్షాలపై సెటైర్లు వేశారు. అది కూడా పద్యాల రూపంలో కౌంటర్లు ఇచ్చారు. అల్పులే భౌ భౌ అని అరుస్తున్నారని మండిపడ్డారు. యోగివేమన జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో గురువారం వేమన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు.
ఇంకా అక్కడే ఆమె ఆగలేదు. పద్యాల రూపంలోనే విపక్ష నేతలను ఓ ఆట ఆడుకున్నారు రోజా.. సజ్జనుడంటే ముఖ్యమంత్రి జగన్ అన్న ఆమె.. కంచులెన్ని మోగినా అవి వీకెండ్ అరుపులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
విపక్ష నేతలు కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారని అయితే వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తొంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను.. సజ్జనుండు పల్కు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా…అని వేమన పద్యం రాశారు. రాష్ట్రంలో సజ్జనుడు అయిన నాయకుడు జగన్. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారు. వారంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఎవరెంతమంది కలిసొచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నారు.
అలాగే కంచులెన్ని మోగినా వారంతా వీకెండ్ పొలిటీషియన్స్ మాత్రమే. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చలించిపోయి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని, సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అన్నారు రోజా.. వేమన పుట్టిన తెలుగు గడ్డపై మనమూ పుట్టడం మన అదృష్టంగా భావించాలని మంత్రి రోజా అన్నారు. 17వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఆయన పద్యాలను నెమరేసుకుంటున్నారంటే ఇంతకన్నా వేమన గురించి చెప్పాల్సిన పని లేదని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Minister Roja