హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja: మెగా ఫ్యామిలీపై మరోసారి రోజా ఫైర్.. అన్‌స్టాపబుల్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: మెగా ఫ్యామిలీపై మరోసారి రోజా ఫైర్.. అన్‌స్టాపబుల్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు

రోజా, మెగా బ్రదర్స్ (ఫైల్ ఫోటో)

రోజా, మెగా బ్రదర్స్ (ఫైల్ ఫోటో)

Roja: కేవలం మెగా హీరోలంటే భయంతోనే వాళ్లతో ఉన్నారని.. ప్రేమతో ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అయినా మెగా ఫ్యామిలీ వల్ల ఏమీ కాదని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ మంత్రి రోజా మరోసారి మెగా ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు. తనపై కొందరు చేసిన విమర్శలు చూస్తే వారికే అసహస్యం వేస్తుందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. అలాంటి వారితో ఎవరు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. అలాంటి వారి గురించి పట్టించుకుంటే ఏమీ చేయలేమని అన్నారు. బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న అన్‌స్టాపబుల్ షోకు(Unstoppable) వెళదామని అనుకున్నానన్న రోజా(Roja).. చంద్రబాబు(Chandrababu Naidu) వెళ్లిన తరువాత తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఆరెడు మంది హీరోలు ఉన్నారని.. వాళ్లు చెప్పినట్టు వినకపోతే అవకాశాలు రావనే కారణంగానే కొందరు వాళ్లు చెప్పినట్టు వింటున్నారని అన్నారు.

కేవలం మెగా హీరోలంటే భయంతోనే వాళ్లతో ఉన్నారని.. ప్రేమతో ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అయినా మెగా ఫ్యామిలీ వల్ల ఏమీ కాదని అన్నారు. వాళ్లకు నిజంగా అంత సీన్ ఉంటే.. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌ను ఎందుకు గెలిపించుకోలేకపోయారని అన్నారు. ప్రజలు నమ్మకం ఉంటేనే ఓట్లు వేస్తారని.. ఊరికే వేయరని రోజా అన్నారు. అలా వేస్తే గతంలో ఒకాయన సీఎం అయ్యేవారని సెటైర్ వేశారు. రాజకీయాల్లో బాబూమోహన్, కోట శ్రీనివాసరావు, శారద, తాను గెలిచానని.. కానీ వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇలా చేయడం వల్ల ఉన్న సింపతీ కూడా కోల్పోతారని విమర్శించారు.

అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనేందుకు మొదట సుముఖంగానే ఉన్నానని రోజా చెప్పుకొచ్చారు. బాలకృష్ణది తనది హిట్ పెయిర్ అని.. తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించామని అన్నారు. అయితే ఆ షోకు వచ్చి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తనకు బాగా బాధించాయని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం సరైందే అని చంద్రబాబు అనడం.. దాన్ని బాలకృష్ణ సమర్థించడం తనకు ఏ మాత్రం నచ్చలేదని అన్నారు. అప్పుడే ఈ షోకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు.

AP Politics: చంద్రబాబుపై కుప్పంలో పెద్ది రెడ్డి పోటీ.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

AP News: రాజకీయాలకు ఎన్టీఆర్ పెద్దల్లుడు గుడ్ బై.. మరి కూతురు పాలిటిక్స్ సంగతేంటి ?.. ఆ ఛాన్స్ లేదా ?

పవన్ కళ్యాణ్ , నారా లోకేశ్ యాత్రల వల్ల ఏమీ జరగదని రోజా అన్నారు. ఇద్దరూ యువత కోసం యాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని.. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయన యువత కోసం ఏం చేశారని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని రోజా విమర్శించారు. ఐటీ మంత్రిగా ఉంటూ యువతకు భరోసా కల్పించలేకపోయిన లోకేశ్... పాదయాత్రతో ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, MLA Roja

ఉత్తమ కథలు