Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINISTER RK ROJA SLAMS JANASENA CHIEF PAWAN KALYAN ON PROTEST AGAINST GOVERNMENT FULL DETAILS HERE PRN TPT

Roja vs Pawan Kalyan: పవన్ అప్పుడెందుకు ప్రశ్నించలేదు.. జనసేనానికి రోజా ప్రశ్న..

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఫోటోలు, వీడియోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏపీ‌ మంత్రి రోజా (Minsiter Roja) తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ (Janasena Party) మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఫోటోలు, వీడియోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏపీ‌ మంత్రి రోజా (Minster Roja) తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని, పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆమె ఎద్దేవా చేశారు. డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని ఆమె చెప్పారు.

    పవన్ కళ్యాణ్ మాట మీద అసలు నిలబడని వ్యక్తని, నాసిరకం పనులు చేసింది తెలుగుదేశం నాయకులని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణం తెలుగుదేశం పార్టీయే అని ఆమె విమర్శించారు.. టిడిపిని, బిజెపిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరని ఆమె మీడియా ముఖంగా అడిగారు.. ప్రధానమంత్రి దేశం కోసం అప్పులు చేయడం లేదా అని ఆమె గుర్తు చేశారు.. అప్పులు తెచ్చినా అభివృద్ధి కోసం జగన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారని, జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక కాలు మీదే కాదు, రెండు కాళ్ళ మీద సరిగ్గా పవన్ కళ్యాణ్ నిలబడలేరని ఆరోపించారు.. ఆకాశాన్ని చూసి మూసేస్తే అది మనపైనే పడుతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలని రోజా అన్నారు.. బిజెపితో కలవాల్సిన అవసరం మాకు లేదని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని రోజా స్పష్టం చేశారు.


    ఇది చదవండి: మంత్రి రోజా కాదు.. ఇకపై ఆటో రోజా.. అదరగొట్టిన ఫైర్ బ్రాండ్..


    ఇదిలా ఉంటే రాష్ట్రంలోని రోడ్లను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేన ఆరోపిస్తోంది. మూడేళ్లుగా రోడ్లను పట్టించుకోకపోగా.. అదనపు పన్నులు వసూలు చేస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రోడ్ల నిర్వహణకు పెట్రోల్ పై సెస్ వసూలు చేయడం, అలే రోడ్లు బాగుచేస్తామంటూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని.. ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని పవన్ ప్రశ్నించారు. గత ఏడాది కూడా జనసేన పార్టీ రోడ్లపై డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఐతే ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ కూడా రోడ్ల అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రెండుపార్టీలు ఒకేసారి ఒకే అంశంపై పోరాటానికి దిగడంతో వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Minister Roja, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు