హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP | RK ROJA: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఆర్కే రోజా .. మంత్రి ఖుషీగా స్టెప్పులు వేసిన వీడియో ఇదే

AP | RK ROJA: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఆర్కే రోజా .. మంత్రి ఖుషీగా స్టెప్పులు వేసిన వీడియో ఇదే

 minister roja dance

minister roja dance

AP| RK ROJA: సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా చాలా హీరోల పక్కన స్టెప్పులు వేసిన రోజా ...మంత్రి అయినా తర్వాత కూడా చీరలో అంతే జోష్‌తో డ్యాన్స్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్‌లలో ఏపీ మంత్రి డ్యాన్స్ వీడియోలే అవుతున్నాయి. ఇంతకీ ఎక్కడ డ్యాన్స్ చేశారో తెలుసా..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja) తిరుపతి(Tirupathi)లో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవాల(Jagananna swarnotsavam)వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఎక్కడికి వెళ్లినా తనదైన స్టైల్‌లో ప్రత్యేకతను చాటుకునే మంత్రి కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక సంబురాల్లో భాగస్వామిగా మారారు. స్టేజ్‌పైకి ఎక్కి మరికొందరు బాలికలతో కలిసి స్టెప్పులు(Dance)వేశారు మంత్రి. సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా చాలా హీరోల పక్కన స్టెప్పులు వేసిన రోజా మంత్రి అయినా తర్వాత కూడా చీరలో అంతే జోష్‌తో డ్యాన్స్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు సోషల్ మీడియా(Social media) గ్రూప్‌లలో ఏపీ మంత్రి డ్యాన్స్ వీడియోలే(Video)వైరల్ (Viral)అవుతున్నాయి.

Tollywood: చిరంజీవికి అవార్డు దక్కడంపై పవన్ కల్యాణ్ రియాక్షన్ .. అన్నయ్య కీర్తి కిరీటంలో ఇదొక వజ్రం

మంత్రి గారా ..మజాకా..!

ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. సంబరాలకు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన నగరి ఎమ్మెల్యే, మినిస్టర్ ఆర్కే రోజా మొదటి రోజు , రెండో రోజు స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో భాగంగా స్టేజ్‌పై పలు ఆల్బమ్స్, పాటలకు బాలికలు డ్యాన్స్ చేస్తుండటం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిని ఆకట్టుకున్నాయి.

స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన రోజా..

వెంటనే రోజా గెస్ట్‌ని అనే విషయం పక్కన పెట్టి స్టేజ్‌పైన బాలికలతో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. చీర కట్టులో కూడా లయబద్ధంగా స్టెప్పులు వేసి వీక్షకుల్ని అలరించారు.జగనన్న స్వర్ణోత్సవాల్లో తొలి రోజు డ్యాన్స్ చేసిన మంత్రి రెండో రోజు కూడా మరికొన్ని ఆల్బమ్స్‌కి స్టెప్పులు వేయడంతో మేడమ్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.భారతీయ సాంస్కృతిక, సంప్రదాయాలకు మూలాలు కళలని..,వీటిని పరిరక్షణే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్‌ పని చేస్తున్నారని ఈసందర్భంగా మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.

CM Jagan: నేడు నరసాపురంలో సీఎం జగన్ .. ఆ రైతులకు శుభవార్త.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌..

తిరుపతిలో జరిగినట్లుగానే జగనన్న స్వర్ణోత్సవ వేడుకలను ఈనెల 24 నుంచి 26వరకు గుంటూరు జోన్‌లో నిర్వహించనున్నారు. 29,30తేదీల్లో రాజమండ్రి జోన్‌లో ..డిసెంబర్‌ 7వ తేది నుంచి 9వరకు విశాఖ జోన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 19, 20తేదీల్లో నిర్వహించనున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Andhra pradesh news, Minister Roja