Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINISTER PERNI NANI MADE INTERESTING COMMENTS ON AP NEW DISTRICTS FULL DETAILS HERE PRN

27th District in AP: ఏపీలో మరోకొత్త జిల్లా..? సీం జగన్ ఆలోచన.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీలో మరో కొత్త జిల్లా (ప్రతీకాత్మకచిత్రం)

ఏపీలో మరో కొత్త జిల్లా (ప్రతీకాత్మకచిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 26 జిల్లాలు (AP New Districts) ఏర్పాటయ్యాయి. ఈనెల 4న కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను సీఎం జగన్ (CM YS Jagan) ప్రారంభించారు. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలైనా.. ఇప్పటికీ కొన్ని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 26 జిల్లాలు (AP New Districts) ఏర్పాటయ్యాయి. ఈనెల 4న కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలైనా.. ఇప్పటికీ కొన్ని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ పలు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాలతోనే ఈ జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలతోనే ఉన్నాయి. తాజాగా గిరిజన ప్రాంతాలతోనే మరో జిల్లా ఏర్పాటుకానుందట. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశముందని పేర్ని నాని అన్నారు.

    మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అంటే రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాలతో జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు పాడేరులో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దీంతో మన్యం ప్రాంతంలో మరో జిల్లా వచ్చే అవకాశమున్నట్లు పేర్ని నాని అన్నారు.

    ఇది చదవండి: ఏప్రిల్ 11నే ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి


    రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం, చింతూరు, అడ్డతీగల, వైరామవరం, మారేడుమిల్లి, కూనవరం, వీఆర్ పురం, నెల్లిపాక, గంగవరం మండలాలున్నాయి. అలాగే రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలు కూడా ఉన్నాయి. ఆయా మండలాలకు రోడ్డు కనెక్టివిటీ కూడా తక్కువే. వీరంతా ఏదైనా అవసరాల నిమిత్తం దూరమైనా రాజమహేంద్రవరం వెళ్తుంటారు. ఇప్పుడు వీరిని పాడేరులోకి మార్చడంతో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణించడం ఇబ్బంది. బస్సు కనెక్టివిటీ కూడా తక్కువ.

    ఇది చదవండి: ఏపీలో పెరిగిన భూముల ధరలు.. కొత్త జిల్లాల తర్వాత సర్కార్ నిర్ణయం


    ప్రభుత్వం కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అప్పటికే రెండు జిల్లాలుగా విభజించడంతో అది కుదర్లేదు. ఐతే రంపచోడవరం, పాడేరు పూర్తిగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ఏదైనా పని నిమిత్తం పాడేరు వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు. పైగా మారుమూల ప్రాంతాల నుంచి సాధారణ రోడ్లపైకి రావడానికే అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజు పూర్తిగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 27వ జిల్లాగా రంపచోడవరంను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని కామెంట్స్ కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP new districts

    తదుపరి వార్తలు