తనను జనసేన కార్యకర్తలు, ప్రజల గెలిపిస్తారనే నమ్మకం లేదని.. అందుకే తాను చంద్రబాబుతో(Chandrababu Naidu) పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు పవన్ కళ్యాణ్ అన్నారని వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ చెప్పింది ఇదేనని ఎద్దేవా చేశారు. తన ముందు ఉన్న జనసేన(Janasena) కార్యకర్తలు, ప్రజలపై తనకు నమ్మకం లేదని.. వాళ్లంతా తనకు ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టారని ఎద్దేవా చేశారు. ఒకరకంగా ఇంతకాలం ముసుగు వేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఇప్పుడు ఆ ముసుగు తీసేశాడని అన్నారు. సభలో పవన్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ప్రజలు గెలిచిన నేతలను ఇష్టమొచ్చినట్టు తిట్టడమేనా పవన్ కళ్యాణ్ సంస్కారం అని ప్రశ్నించారు. ఇదేనా ఆయన నీ వ్యక్తిత్వమని మండిపడ్డారు.
పవన్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనింద. సినిమా డైలాగ్స్‌కే పవన్ ప్రసంగం సరిపోయింది. సభకువచ్చిన జనాన్ని నమ్మను అని చెప్పడమే దౌర్భాగ్యమని ఆరోపించారు. సభలో తనను అభిమానించే వారిని కూడా పవన్ కళ్యాణ్ కించపరిచాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ మూడు ముక్కల రాజకీయ నాయకుడుని పేర్ని నాని ఆరోపించారు. ఆయన ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. ఓ వైపు బీజేపీతో మరోవైపు టీడీపీతో రాజకీయం చేశారని విమర్శించారు.
దేశంలో పవన్ ఒక్కడే బరితెగింపు రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సభకు వచ్చిన జనాన్ని నమ్మనని పవన్ ఎలా అంటారని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేశాడని.. బీసీలను మోసం చేశాడని.. స్టేజ్ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదని పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కట్టిస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసింది పోరాటమా ? అని అన్నారు. చంద్రబాబు , పవన్ కలిసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై శ్రీకాకుళం జిల్లా సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్.. పవన్ కళ్యాణ్ ఫైర్
పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అని సంభోదించడంపై పేర్ని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించినంత మాత్రాన అలా అంటారా ? అని విమర్శించారు. మీ ఇంట్లోనూ సినిమాల్లో నటించిన మహిళలు ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా హీరోయిన్ల పట్ల మీకున్న అభిప్రాయం ఇదేనా ? అని ప్రశ్నించారు. రోజా రాజకీయాల్లో పోరాడారని.. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని.. ఈ రోజు మంత్రిగా ఉన్నారని అన్నారు. మహిళల విషయంలో పవన్ కళ్యాణ్‌కు ఏ రకమైన గౌరవం ఉంటుందనే విషయంలో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని పేర్ని నాని కామెంట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.