AP POLITICS AP MINISTER PEDDIREDDY RAMA CHANDRA REDDY MADE KEY COMMENTS ON POWER CRISIS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
AP Power Crisis: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ కోతలకు త్వరలోనే ముగింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గత కొన్నిరోజులుగా నెలకొన్న విద్యుత్ కొరత (AP Power Crisis) కు పరిష్కారం చూపేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గత కొన్నిరోజులుగా నెలకొన్న విద్యుత్ కొరత (AP Power Crisis) కు పరిష్కారం చూపేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) తెలిపారు. ఏపీలో విద్యుత్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో మరో రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైనట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుండి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. కృష్ణపట్నంలో మరో నెలలో 800 మెగావాట్లు, ఎన్టీటీపీఎస్ లో మరో మూడు, నాలుగు నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. కృష్ణపట్నం యూనిట్ ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాక కొత్తగా మరో 6000 మెగావాట్ల హైడల్ సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. దీనివల్ల రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీనిలో 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలోను డిమాండ్, సప్లై ల మధ్య భారీగా అంతరం ఉండటం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ విద్యుత్ లభ్యత లేక సాధ్యపడటం లేదని అన్నారు. దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత వల్ల కొన్ని థర్మల్ ప్లాంట్లు మూతబడ్డాయన్నారు.
అదే సమయంలో కోవిడ్ అనంతరం ఆర్థిక కలాపాలు పుంజుకోవటం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవటం వల్ల నిరంతరంగా నడిచే పరిశ్రమలకు 50 శాతం లోడ్ రిలీఫ్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఖచ్చితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గృహ విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులోనూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ను కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుత సమస్య కేవలం బొగ్గు కొరత వలనే ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించి సరఫరాను యధా స్థితికి తీసుకురావటానికి విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులంతా ఈ సమయంలో విద్యుత్ సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగి పవర్ ఎక్స్ఛేంజీలలో కొనేందుకు కూడా విద్యుత్ దొరకని ఈ సమయంలో కూడా వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.
నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ రంగం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటోందని, విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ముందుచూపుతో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారని తెలిపారు. దానికి అనుగుణంగానే మంచి ఫలితాలను సాధించామన్నారు. విద్యుత్ విషయంలో జాతీయ స్థాయిలోనే ఇబ్బందులు ఏర్పడ్డాయని, పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.