హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అమరావతి రైతులకు మంత్రి కొడాలి ఆహ్వానం

అమరావతి రైతులకు మంత్రి కొడాలి ఆహ్వానం

ఆ వైరస్ గురించి ప్రజలకు తెలియడంతో ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు అని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు..

ఆ వైరస్ గురించి ప్రజలకు తెలియడంతో ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు అని విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు..

ఈ సందర్భంగా అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని ప్రశ్నించారు కొడాలి నాని.

అమరావతిలో రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని గ్రామాల్లో రైతులు మూడువారాలుగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి రైతుల్ని చర్చలకు ఆహ్వానించారు ఏపీ మంత్రి కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంత రైతులు మోసపోవద్దన్నారు. లక్ష కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించే బదులు... అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను కొంతమేర అభివృద్ధి చేస్తే ఢిల్లీ, హైదరాబాద్ నగరాలతో పోటీ పడుతుందని ఆయన తెలిపారు. అమరావతి రైతులు చర్చకు రావాలని ఆహ్వానించారు. తమ డిమాండ్లను అమరావతి రైతులు వివరిస్తే... న్యాయం చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. సరైన అవగాహన, డిమాండ్లతో వస్తే ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని కాదని ఎవరన్నారని ప్రశ్నించారు కొడాలి నాని.First published:

Tags: Amaravathi, Amaravati, Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kodali Nani

ఉత్తమ కథలు