హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జూ.ఎన్టీఆర్‌ని చంద్రబాబు అందుకే పక్కన పెట్టేశారు... మంత్రి కీలక వ్యాఖ్యలు

జూ.ఎన్టీఆర్‌ని చంద్రబాబు అందుకే పక్కన పెట్టేశారు... మంత్రి కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు,జూ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు నాయుడు,జూ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.

ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటలు తూటాలు పేల్చుతున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం మరింత వేడక్కింది.తాజాగా మంత్రి కొడాలి నాని కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. అందుకే ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారన్నారు మంత్రి కొడాలి.

అయితే తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని ఆరోపించారు. వాస్తవానికి లోకేశ్ ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని సెటైర్లు వేశారు మంత్రి. కుమారుడు అయినందువల్లే లోకేశ్ ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని విమర్శలు చేశారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

First published:

Tags: AP Politics, Chandrababu naidu, Jr ntr, Kodali Nani, Nara Lokesh, Tdp, Ysrcp

ఉత్తమ కథలు