Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINISTER GUDIVADA AMARNATH MADE SENSATIONAL COMMENTS ON YS JAGAN DAVOS TOUR FULL DETAILS HERE PRN

AP Minister: నాకళ్లు చెమర్చాయి.. వాళ్లకు చేతులెత్తి మొక్కుతా.. దావోస్ టూర్ పై ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

మంత్రి గుడివాడ అమర్ నాథ్ (File)

మంత్రి గుడివాడ అమర్ నాథ్ (File)

సీఎం జగన్ (AP CM YS Jagan) బృందం దావోస్ టూర్ పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Minster Gudivada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) పై ఓ వర్గం మీడియా అసత్య ప్రచారాలు చేస్తోంది.. ప్రపంచ వేదికపై వైజాగ్ రక్షణపై అనుమానాలు లేవనెత్తితే తన కళ్లు చమర్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

ఇంకా చదవండి ...
  సీఎం జగన్ (AP CM YS Jagan) బృందం దావోస్ టూర్ పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Minster Gudivada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) పై ఓ వర్గం మీడియా అసత్య ప్రచారాలు చేస్తోంది.. ప్రపంచ వేదికపై వైజాగ్ రక్షణపై అనుమానాలు లేవనెత్తితే తన కళ్లు చమర్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వరదలొస్తే విశాఖ మునిగిపోతుందని ఓ వర్గం మీడియా ఈ ప్రాంత ఇమేజ్ ను దెబ్బతీసిందని.., రాష్ట్రానికి, విశాఖకు హాని చేయొద్దు అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానంటూ అమర్ నాథ్ అన్నారు. విశాఖను యూనికార్న్ హబ్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ విజన్ అని.., గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్చూచి కాబోతుందన్నారు. డీకార్బనైజ్డ్‌ మెకానిజంలో ఐకాన్ గా ఏపీ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు అమర్ నాథ్.

  ఐటీ హబ్ గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఇమేజ్ ను దెబ్బతీస్తే సహించలేకపోయానని, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో అడిగిన ఆ ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు, అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఈ దుష్ప్రచారాన్ని దయచేసి ఇంకెవరికీ చెప్పవద్దని కోరానని అమర్ నాథ్ చెప్పారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అంతా కలిసిరావాలని, రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఎవరూ పణంగా పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు.

  ఇది చదవండి: ఆ మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? జనసేన-బీజేపీ-టీడీపీ లెక్కలేంటి..?


  దావోస్ టూర్లో దాదాపు 50మంది ప్రపంచ స్థాయి మల్టీ నేషనల్‌ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ జరిగిందని., ఏపీలో ఐటీకి ఎక్కువ అవకాశాలు ఉన్న విశాఖ నగరాన్ని ఒక యూనికార్న్‌ హబ్‌గా చేయలనే లక్ష్యంతో యూనికార్న్‌, ఓయో సంస్థ ప్రతినిధులు, స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

  ఇది చదవండి: ఇకపై వార్ వన్ సైడే.. గ్రూపులు కడితే గెట్ ఔట్.. చంద్రబాబు కామెంట్స్


  వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో మూడు ప్రధాన అంశాల మీద ఫోకస్‌ చేశామని.., హెల్త్‌ కు సంబంధించిన సదస్సులో ప్రపంచస్థాయి వ్యక్తులతో పాటు సీఎం జగన్‌ గ్లోబల్‌ లీడర్‌గా పాల్గొన్నారని., హెల్త్‌కు సంబంధించిన సదస్సులో తాను, విద్యకు సంబంధించిన సదస్సులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పాల్గొన్నారన్నారు.

  ఇది చదవండి: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..?


  ప్రధానంగా డీకార్బనైజ్డ్‌ ఎకానమీ మీద దృష్టి సారిస్తూ, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందని., గ్రీన్‌ ఎనర్జీ ప్రొడక‌్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. కర్నూలులో నిర్మిస్తున్న విండ్‌, హైడల్‌, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. డీకార్బనైజ్డ్‌ ఎకానమికీ సంబంధించి అదానీ, గ్రీన్‌ కో, అరబిందో లు ప్రధాన పరిశ్రమలు. వీటికి సంబంధించి దాదాపు రూ. లక్షా 25వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?


  హుద్‌హుద్‌ తుపానును చూపించి, ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ప్రాంతం ఇమేజ్‌ను కొంతమంది దెబ్బతీశారని., రాష్ట్రంతో పాటు విశాఖపై ఎందుకంత కక్ష కట్టారని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. లోకేష్ కు ఏ సూటూ సూటు అవ్వదని.., మాకు సూటు అయితే, దాన్ని చూసి ఏడవటం ఎందుకని.., ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు ఆపాలంటూ అమర్ నాథ్ హితవుపలికారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు