హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: మద్యపాన నిషేధం హామీ ఇవ్వలేదు.. కావాలంటే మేనిఫెస్టో చూసుకోండి.. ఏపీ మంత్రి కామెంట్స్..!

AP Politics: మద్యపాన నిషేధం హామీ ఇవ్వలేదు.. కావాలంటే మేనిఫెస్టో చూసుకోండి.. ఏపీ మంత్రి కామెంట్స్..!

మంత్రి గుడివాడ అమర్ నాథ్ (File)

మంత్రి గుడివాడ అమర్ నాథ్ (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యపాన నిషేధం (Liquor Ban) విధిస్తామని వైసీపీ (YSRCP) ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బెల్టు షాపులను రద్దు చేయడంతో పాటు వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యపాన నిషేధం (Liquor Ban) విధిస్తామని వైసీపీ (YSRCP) ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బెల్టు షాపులను రద్దు చేయడంతో పాటు వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది. గతంలో నాలుగు వేలకు పైగా ఉన్న మద్యం షాపులను 33శాతం మేర తగ్గించింది. ఆ తర్వాత మద్యం రేట్లు పెరగడమే కాకుండా.. బ్రాండ్ల విషయంలో రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన హామీని వైసీపీ అమలు చేయలేదిన.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు మద్యానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు మద్యం ఉత్పత్తి, బ్రాండ్లపై ఏపీలో పెద్ద రచ్చే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) మద్యనిషేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన అసలు ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమన్న హామీనే లేదని.. కావాలంటే మేనిఫెస్టో చూసుకోవాలన్నారు. మద్యం తాగాలంటేనే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామని మాత్రమే చెప్పామన్నారు. ఫైవ్ స్టార్ హోటల్ ధరలు అమలు చేసి మద్యం వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పినట్లు అమర్నాథ్ వెల్లడించారు. అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మా మేనిఫెస్టో ఉంటుందని.. అక్కడ కూడా చూసుకోవచ్చన్నారు. ఐతే మద్యం విషయంలో తమ ప్రభుత్వానికి ఒక మార్కికి కేవలం 0.25 శాం మార్కులే ఇచ్చుకుంటామని కూడా చెప్పారు గుడివాడ అమర్నాథ్.



ఇది చదవండి: మంత్రి రోజా అరుదైన రికార్డ్.. 3వేల మంది ఫోటోగ్రాఫర్లు.. సింగిల్ క్లిక్.


మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మద్యనిషేధం హామీ ఇచ్చి ఫెయిలయ్యారంటూ ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా చూస్తామన్న వైసీపీ నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కామెంట్స్ పై ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దశలవారీగా మద్య నిషేధం హామీని.. దశల వారిగా తప్పుతున్నారంటూ ట్వీట్ చేశారు.

ఇది చదవండి: అక్రమ మద్యాన్ని సైడ్ చేసిన పోలీస్.. సీక్రెట్ గా మార్కెట్లో అమ్మకం.. ఎలా చిక్కాడంటే..!


ఇదిలా ఉంటే మద్యం బ్రాండ్ల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తయారీ డిస్టలరీస్ విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడేక్కాయి. మద్యం బ్రాండ్లకు మీరే అనుమతిచ్చారని టీడీపీని వైసీపీ.. కాదు వైసీపీ ప్రభుత్వంలోనే పర్మిషన్స్ వచ్చాయని.. వీటి వెనుక ముఖ్యనేతల హస్తముందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్యనిషేధంపై మంత్రి అమర్నాథ్ కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా కామెంట్స్ తర్వాత పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Liquor ban

ఉత్తమ కథలు