AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయం ప్రస్తుతం రాజధాని చుట్టూ తిరుగుతోంది. ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati) ని కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ.. 29 గ్రామాల ప్రజలకు ఉత్తరాంధ్రలో ఉన్న అరసవల్లి వరకు మహా పాద యాత్ర (Maha Padayatra) కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఆ యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార వైసీపీ (YCP).. ఇప్పటికే ర్యాలీలు చేపడుతోంది. అయితే వికేంద్రీ కరణ వాయిస్ ను మరింత బలంగా ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో.. ఈ నెల 15న విశాఖ (Visakha)లో మహా గర్జనకు పిలుపు ఇస్తున్నారు. అయితే అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం.. విశాఖకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహా గర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గర్జన ఎందుకు నిర్వహించాల్సి వస్తుందో మంత్రి ధర్మాన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదన్నారు.
ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయి. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోంది. అది అందరికీ తెలిసేలా చేయడానికే ఈ మహా గర్జన నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర అనేక రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఏపీ రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కొన్ని వర్గాల అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు.
ఇదీ చదవండి : పొద్దు పొద్దునే గూబ గుయ్యిమందా..? లెక్క తేలిందా అంటూ లోకేష్ సెటైర్లు
రాష్ట్రంలో ప్రజలు అందరికీ న్యాయం జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని మనకు అవసరమా అని ప్రశ్నించారు..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోల్చి చూస్తే.. అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉందని.. కానీ అమరావతిలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదన్నారు.. అందుకే విశాఖనే రాజధాని చేయడం సరైన చర్య అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : కౌలు రైతులకు బంపర్ ఆఫర్..! ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బ్యాంకర్ల మాటేంటి?
అసలు విశాఖకు పరిపాలన రాజధాని వస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించారు.. ఉత్తరాంధ్రకు ఒక్క సంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా..? టీడీపీకి అండగా నిలిచిన చంద్రబాబు నాయుడు.. ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. విశాఖలో సెంటిమెంట్ లేదని అంటారా.. నిజంగా ఒకవేళ అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రాజధాని పేరుతో మీరు మోసం చేశారన్న సంగతి మంగళిగిరి ప్రజలు గుర్తించారు కాబట్టే లోకేష్ ఓడిపోయారని ధర్మాన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఇందుకేనా మీ గర్జన..? మరోసారి సర్కార్ పై పవన్ సీరియస్..? ఏమన్నారంటే..?
ప్రస్తుతం విజయవాడ , అమరావతిలో యాక్సెప్టబుల్ కల్చర్ లేదని మంత్రి తెలిపారు. ఇతరులను అక్కడికి రానివ్వని వాతావరణాన్ని క్రియేట్ చేశారని మంత్రి ఆరోపించారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు. దీంతో అమరావతిలో ఒక సాధారణ కుటుంబం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ది చెందక ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడుకూడా తమ ప్రాంతాన్ని దోచుకొనే కుట్రలు జరుగుతుండడం దారుణమన్నారు. అభివృద్ది చెందిన నగరాలేవీ కూడా ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవన్నారు. ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందితే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది జరగదన్నారు. దీంతో గతంలో ఉద్యమాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ధర్మాన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Srikakulam