హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: దివంగత ఎన్టీఆర్‌పై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...

AP Politics: దివంగత ఎన్టీఆర్‌పై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...

ఎన్‌టీ రామారావు (ఫైల్ ఫోటో)

ఎన్‌టీ రామారావు (ఫైల్ ఫోటో)

NT Ramarao: ఎన్టీఆర్‌తో వైఎస్ఆర్‌కు పోలిక లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంతో రాష్ట్ర రాజకీయం అంతా ఈ పేరు మార్పు చుట్టే తిరుగుతోంది. దీనిపై అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు సమర్థిస్తుంటే.. టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌తో వైఎస్ఆర్‌కు పోలిక లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా (Dadishetty Raja) స్పందించారు. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వెన్నుపోటుతో పదవిని కోల్పోయిన అసమర్థుడు ఎన్టీఆర్ (NTR) అని దాడిశెట్టి రాజా అన్నారు. అందుకే ఎన్టీఆర్, వైఎస్ఆర్ (YSR) మధ్య పోలిక లేదని తాను చెబుతున్నానని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పేదల ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని మంత్రి దాడిశెట్టి అన్నారు.

  అంతకుముందు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల నిజమైన ఎన్టీఆర్ అభిమానుల కంటే ఆయనను రాజకీయంగా వాడుకునే చంద్రబాబు లాంటి వాళ్లే ఎక్కువగా బాధపడుతున్నారని ఎన్టీఆర్ భార్య, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. యూనివర్సిటీ కంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పెద్ద విషయమని ఆమె తెలిపారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలుస్తానని.. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తాను కోరుతానని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకూడదని చంద్రబాబు అప్పటి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కొన్ని మీడియాల్లో తన గురించి వచ్చిన అంశాల్లో వాస్తవం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో తాను ఏ రోజూ కూడా పార్టీ వ్యవహారాల్లో తలదూర్చలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

  ఈ విషయంలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అసత్యమని అన్నారు. టీడీపీలో కొందరు నాయకులు ఇప్పటికీ ఉన్నారని.. వారిని అడిగితే అప్పట్లో తాను ఏ విధంగా వ్యవహరించాననే విషయాన్ని చెబుతారని అన్నారు. ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే వాళ్లు మళ్లీ తనపై విషప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఏ స్వార్థంతోనూ ఎన్టీఆర్ జీవితంలో రాలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గతంలో ఎన్టీఆర్ తన గురించి ఏం చెప్పారనే విషయాలను వీడియోలు ద్వారా ప్రదర్శించారు.

  Kodali Nani: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  Chandrababu: కుప్పంపై చంద్రబాబు వ్యూహం మారిందా ?.. జగన్ ఆలోచనకు భిన్నంగా..?

  ఎన్టీఆర్ తన చివరి ఇంటర్వ్యూలోనే ఈ విషయాలన్నీ చెప్పారని అన్నారు. ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు తనమీద చేసిన వ్యాఖ్యలను తాను ఖండించానని లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎవరి నుంచి అలాంటి వస్తువులు ఆశించలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎర్రబెల్లికి ఈ కారణంగానే మంత్రి పదవి రాకపోతే.. ఆ తరువాత చంద్రబాబు హయాంలో అతడికి మంత్రి పదవి ఎందుకు రాలేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. ఈ విషయంలో తాను స్పందించలేదని అనడం సరికాదని వ్యాఖ్యానించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, NTR

  ఉత్తమ కథలు