ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు వ్యవహార శైలిని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నపుడు ఆయన శైలి ఒకలా ఉండేదని, ఆయన చనిపోయాక రాష్ట్రంలో తానొక్కడినే లీడర్ అనుకున్నారని ఎద్దేవా చేశారు. తాను వైసీపీలో చేరేముందు చంద్రబాబుతో మాట్లాడానని.. ఆ సందర్భంలో తాను మంత్రిని కూడా అవుతానని చెప్పగా.. నువ్వు వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తాను మంత్రిని కూడా అయ్యాయని చంద్రబాబు ముందే స్పీకర్‌కు తెలిపారు. ఇక, హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అవంతి అన్నారు.
అటు.. ఎమ్మెల్యే రోజా కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తనను మార్షల్స్ తోసేశారని చంద్రబాబు అంటున్నారని, గతంలో తనను అన్యాయంగా సభ నుంచి విసిరేసినప్పుడు ఏమైందని ఆమె నిలదీశారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయితే ఒక్కసారి కూడా మైక్ ఇవ్వలేదని, ప్రజా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఇవ్వలేదని అన్నారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా తనను సభలోకి రాకుండా అడ్డుకున్నారని నాట సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap assembly sessions, AP News, AP Politics, Avanthi srinivas