Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINISTER AMBATI RAMBABU FIRES ON CHANDRABABU AND JANASENA FULL DETAILS HERE PRN

AP Politics: చంద్రబాబు సన్యాసానికి సిద్ధమా..? ఏపీలో చల్లారని విద్యుత్ మంటలు.. ఏపీ మంత్రి సవాల్..!

చంద్రబాబు, అంబటి రాంబాబు (ఫైల్)

చంద్రబాబు, అంబటి రాంబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ధరల మంటలు మండుతూనే ఉన్నాయి. విద్యుత్, బస్సు, పెట్రోల్ ధరల అంశంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ధరల మంటలు మండుతూనే ఉన్నాయి. విద్యుత్, బస్సు, పెట్రోల్ ధరల అంశంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రం కన్నా ఎక్కువ టారిఫ్, ఎక్కువ ధరలు ఉన్నట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ చంద్రబాబు (Chandrababu) చేసిన సవాల్ పై.. మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు కర్ణాటకలో, ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రంలో మనకన్నా ఎక్కువున్నాయన్న మంత్రి.. చంద్రబాబు ఎప్పుడు రాజకీయ సన్యాసం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. సింగిల్ గా పోటే చేసే దమ్ములేక....చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా ఎందుకు పోటీ చేయరో చెప్పాలన్నారు.

    జిల్లాలో పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడిన మాటలను చూస్తుంటే.. నవరసాలను ఒలికించే ప్రయత్నం చేశారని అంబటి ఎద్దేవా చేశారు. పతనమైపోతున్న పార్టీ, తన ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోందన్న ఆయన.... జిల్లాల పర్యటనల పేరుతో అసత్యాలు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. జనసేన పార్టీపైనా స్పందించిన మంత్రి.. ఆ పార్టీకి దిశ, దశ లేదని వ్యాఖ్యానించారు. ఆశలు, ఆశయాలు లేని ఆ పార్టీ.. ఎవరు కొంటారా అని ఎదురుచూస్తుందని ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: రాష్ట్రంలో అత్యాచారాలు టీడీపీ పనే.. బాబుకి పొత్తులేనిదే నిద్రపట్టదు.., విజయసాయి సంచలన కామెంట్స్.


    చంద్రబాబు పాలనలో అసలు పన్నులే వేయలేదా అన్న అంబటి రాంబాబు.... పన్నులు వేయకుండానే ప్రభుత్వాలు నడుస్తాయా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు అందుతున్న నవరత్నాలు అమలు కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు కుట్రపన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కాపు నేస్తం పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్దిచేకూరుస్తున్నామని మంత్రి వెల్లడించారు.

    ఇది చదవండి: వందేళ్ల రికార్డులు తరగరాస్తున్న జగన్.. వెయ్యి గ్రామాల్లో పనులు పూర్తి..


    మాజీ మంత్రి దేవినేని గురించి మాట్లాడుతూ....పోలవరం ప్రారంభించే, ఎన్నికలకు వెళతామని రాసుకో...అంటూ ఉమా అసెంబ్లీలో బల్ల గుద్ది మరీ చెప్పడాన్ని అంబటి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో చేస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో విమర్శలు సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా చేసిన తప్పిదాల వల్లే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్‌ ఇబ్బందుల్లో పడిందని...ఆ తప్పిదాలను మాపై రుద్దాలని ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయకుండా.....పొత్తుల ఎత్తులు ఎందుకు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలన కంటే జగన్ మూడేళ్ళ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. జగన్ ని దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ...ఆరోపణలు చేసినవారంతా కాలగర్భంలో కలవక తప్పదని మంత్రి హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, Chandrababu Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు