ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక సీటును గెలుచుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. టీడీపీ గెలుపును అడ్డుకోవాలని అధికార వైసీపీ నాయకత్వం ఎంతగా ప్రయత్నించినా.. తమ ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో విజయం సాధించలేకపోయింది. టీడీపీకి(TDP) అనుకూలంగా ఓటు వేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఇద్దరు కచ్చితంగా వీరేనా ? లేక మరెవరైనా ఉన్నారా ? అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2019లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్‌కు (YS Jagan) శాసనమండలి(Legislative Council) కలిసిరాలేదనే చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న వైసీపీ నాయకత్వం.. టీడీపీకి మెజార్టీ ఉన్న మండలిలో మాత్రం ఈ బిల్లును గట్టెక్కించుకోలేకపోయింది. అలా ఈ బిల్లు ఆలస్యం కావడానికి కారణమైంది. మూడు రాజధానుల విషయంలో తమ అభిమతానికి భిన్నంగా వ్యవహరించిన శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దానిని కేంద్రానికి పంపారు.
అయితే ఆ తరువాత కాలం గడుస్తున్న కొద్దీ వైసీపీకి మండలిలో పూర్తి మెజార్టీ రావడంతో.. మండలిని రద్దు చేయాలనే విషయంలో సీఎం జగన్ కాస్త మెత్తబడ్డారు. అయితే తాజాగా మండలికి ప్రాతినిథ్యం వహించే పట్టభద్రుల ఎన్నికల్లోనూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న టీడీపీకి ఈ ఎన్నికలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ఊహించని విధంగా ఒక సీటును గెలుచుకుంది.
Breaking News: జయమంగళం ఓటమికి కారణాలు ఇవే? ఆ ఇద్దరిపై వేటు తప్పదా..? సంబరాల్లో టీడీపీ
Breaking News: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు
వైసీపీని అనూహ్యంగా దెబ్బకొట్టిన టీడీపీ.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఇకపై ఏ ఎన్నిక జరిగినా.. విజయం టీడీపీదే అని ఆ పార్టీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. గతంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో సీఎం జగన్‌కు టీడీపి శాసనమండలి ద్వారా షాక్ ఇవ్వగా.. తాజాగా శాసనమండలి ఎన్నికల్లోనే మరోసారి టీడీపీ వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టింది. దీంతో సాధారణ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో శాసనసభలో మెజార్టీ సాధించిన వైఎస్ జగన్‌కు మరోసారి శాసనమండలి కలిసిరాలేదనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.