Home /News /andhra-pradesh /

AP POLITICS AP HIGH COURT SENSATIONAL COMMENTS ON BIGG BOSS TELUGU SHOW SB

Bigg Boss Telugu: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ షో గురించి మన దగ్గర కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎక్కడో ఫారెన్ కంట్రీస్‌లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్. దాంతో అందరూ కూడా ఈ ఇంటిపై బాగానే కన్నేసారు ఇప్పుడు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ 15 కూడా పూర్తయింది. తెలుగులో ఓటిటి వర్షన్ మొదలు కానుంది.

బిగ్ బాస్ షో గురించి మన దగ్గర కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎక్కడో ఫారెన్ కంట్రీస్‌లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్. దాంతో అందరూ కూడా ఈ ఇంటిపై బాగానే కన్నేసారు ఇప్పుడు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ 15 కూడా పూర్తయింది. తెలుగులో ఓటిటి వర్షన్ మొదలు కానుంది.

ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా బిగ్‌బాస్‌షోను ప్రసారం చేస్తున్నారని ఇలాంటి షోలను నియంత్రించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

    తెలుగులో వస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈ షోపై పలువురు రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. అలాంటి పనికిమాలిన షోలు ప్రజలకు, సమాజానికి అవసరం లేదన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిగ్ బాస్ రియాల్టీ షోపై  కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ షో ఓ చెత్త రియాలిటీ షో అని పేర్కొంది న్యాయస్థానం. ఇలాంటి షోల వల్ల యువత పెడదారి పడుతోందని పేర్కొంది. సమాజం ఎటు వెళుతోందో అర్థం కావటంలేదని... హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా సైలెంట్‌గా ఉంటే అనర్థాలు తప్పవంది. దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించింది.

    ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా బిగ్‌బాస్‌షోను ప్రసారం చేస్తున్నారని కేవలం ధనార్జనే ధ్యేయంగా యువతను పెడమార్గం పట్టిస్తున్న ఇలాంటి షోలను నియంత్రించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అహ్సదుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావుల నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. పిల్‌పై జగదీశ్వర్‌రెడ్డి తరుపు న్యాయవాది గుండాల ప్రసాదరెడ్డి సోమవారం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. విచారణ జరపాలని కోర్టును ఆయన అభ్యర్థించారు.

    బిగ్‌బాస్‌ లాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్‌ను కాలరాస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సమాజానికి ఉపయోగంగా ఉండే మంచి వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశంసించింది. బిగ్‌బాస్‌ లాంటి షోలపై ఇన్నిరోజులు పిటిషన్‌లు ఎందుకు రావటంలేదా అనుకున్నామని ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు సమయం వచ్చింది.. ఇలాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయి. సమాజంలో అసభ్యకర, అశ్లిలతను పెంచిపోషిస్తున్నాయన్నారు.
    బిగ్‌బాస్‌ షో ఎప్పటి నుంచో వస్తుంటే ఇప్పటి వరకు ఏంచేశారని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

    అయితే దీనిపై 2019లోనే పిటిషన్‌ దాఖలు చేసినట్లు పిటిషనర్‌ తరుపు న్యాయవాది గుర్తుచేశారు. ఇలాంటి వ్యాజ్యంలో ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీకాలేదా అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని ఇకనైనా కోర్టు స్పందిస్తుందనే భావనతో దీన్ని ప్రస్తావిస్తున్నట్లు న్యాయవాది ప్రసాదరెడ్డి తెలిపారు. దీంతో ఈ వ్యాజ్యంపై సోమవారమే విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. మరి బిగ్ బాస్ షోపై కోర్టు సోమవారం ఎలాంటి ఆదేశాలు ఇస్తోంది వేచి చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: AP High Court, Bigg Boss, Bigg boss ott telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు