Home /News /andhra-pradesh /

AP POLITICS AP HIGH COURT ISSUES KEY ORDERS TO GOVERNMENT ON CAPITAL AMARAVATI FULL DETAILS HERE PRN

AP Capital: అమరావతి అంశంలో మరో మలుపు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (AP Capital Amaravati) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (AP Capital Amaravati) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని, రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ తో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అమరావతిపై గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడంలేదంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. నిధులు సాకుతో కోర్టు తీర్పును అమలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన కోర్టు అమరావతిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూలై 12కు వాయిదా వేసింది.

    అమరావతి నిర్మాణాలను కొనసాగించాలంటూ మార్చి మొదటివారంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయడానికి వీల్లేదని, రాజధానిని తరలించే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లకు రూ.50వేలు చొప్పున ఖర్చులు చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొంది. నెలరోజుల్లో రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మార్చి మూడో వారంలో సీఆర్డీఏ రైతులకు లేఖలు రాసింది. ఐతే ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై మరింత స్పష్టత కావాలని, వివాదంలో ఉన్నవాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ రైతులు తిరిగి సీఆర్డీఏను ప్రశ్నించారు.

    ఇది చదవండి: పవర్ కట్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదా..


    ఇంతలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రావడం మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన సభలో ప్రకటించడం సంచలనంగా మారింది. న్యాయస్థానం తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని సభ అభిప్రాయపడటమే కాకుండా.. మూడు రాజధానులే రాష్ట్రాభివృద్ధికి అవసరమని.. అదే తమ విధానమని సభలో సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పీకర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    ఇది చదవండి: చేపలమ్మిన రోజా.. మంత్రి అయ్యాక ఎక్కడా తగ్గడం లేదుగా..!


    ఆ తర్వాత కోర్టు తీర్పు అమలుకు గడువు తీరే సమయంలో అమరావతి నిర్మాణానికి 60 నెలలు సమయం కావాలని, నిధుల కోసం అన్వేషిస్తున్నామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు.. ప్రభుత్వం కావాలనే అమరావతి నిర్మాణాలను చేపట్టడం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం రాజధానిలో పలు నిర్మాణాలకు సంబంధించి పనులను ప్రారంభించింది. ఈ లోగా రైతుల పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది..? కోర్టు తీర్పును అమలు చేసిన దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను సమర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap capital

    తదుపరి వార్తలు