హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cm Jagan: విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు..ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ కీలక విజ్ఞప్తులు ఇవే..

Cm Jagan: విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు..ప్రధాని మోడీ ముందు సీఎం జగన్ కీలక విజ్ఞప్తులు ఇవే..

Pc: Twitter

Pc: Twitter

విశాఖలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ ప్రారంభం అయింది. ఈ సభలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దేశ ప్రగతి రధ సారధి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం. ఉత్తరాంధ్ర గడ్డపై ప్రధానికి ఘన స్వాగతం తెలుపుతున్నాం. ఇక్కడకు లక్షల మంది కదిలొచ్చారు. విశాఖ మొత్తం జనసంద్రం కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఎగిసిపడే కెరటాలకు మించి జనకెరటాలు ఉవ్వెతున ఎగిసిపడుతున్నారు. ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది.వికేంద్రీకరణ పారదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం. ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంది. విభజన గాయం నుంచి ఇంకా ఏపీ కోలుకోలేదు. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు చాలా విజ్ఞప్తులు చేశాం అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh | Visakhapatnam

విశాఖలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ ప్రారంభం అయింది. ఈ సభలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దేశ ప్రగతి రధ సారధి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం. ఉత్తరాంధ్ర గడ్డపై ప్రధానికి ఘన స్వాగతం తెలుపుతున్నాం. ఇక్కడకు లక్షల మంది కదిలొచ్చారు. విశాఖ మొత్తం జనసంద్రం కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఎగిసిపడే కెరటాలకు మించి జనకెరటాలు ఉవ్వెతున ఎగిసిపడుతున్నారు. ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది.వికేంద్రీకరణ పారదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం. ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంది. విభజన గాయం నుంచి ఇంకా ఏపీ కోలుకోలేదు. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు చాలా విజ్ఞప్తులు చేశాం.

PM Narendra Modi: ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరడం ఖాయం: ప్రధాని నరేంద్ర మోదీ

మోడీతో అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం. రూ.10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ నిలదొక్కుకోడానికి కేంద్రం మరింతగా సహకరించాలని సీఎం జగన్ కోరారు. విశాఖ సభా వేదికగా ప్రధాని ముందు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ల విజ్ఞప్తులను సీఎం జగన్ గుర్తు చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొక అజెండా ఉండదని చెప్పారు. ఏపీలో ప్రతీ ఇళ్లు నిలదొక్కుకునేలా ముందుకు అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోడీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు.  మా రాష్ట్రానికి, మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకున్న ప్రజలు పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమను, అభిమానాన్ని ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారని అన్నారు.

Team India : ఈ ప్లేయర్లను భరించింది చాలు.. వెంటనే తరిమేయండి.. లేదంటే టీమిండియా ఎప్పటికీ బాగుపడదు

Prime Minister Narendra Modi lays the foundation stone of projects worth over Rs 10,500 crores in Vishakhapatnam, Andhra Pradesh.

Union Minister Ashwini Vaishnaw and CM YS Jagan Mohan Reddy also present. pic.twitter.com/aCtEXWBuRc

— ANI (@ANI) November 12, 2022

తెరపైకి ప్రత్యేక హోదా అంశం:

రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు దృష్యా పలు సందర్భాల్లో అనేక విజ్ఞప్తులు చేశాం. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రానికి 8 ఏళ్ల క్రితం తగిన గాయాలు ఇంకా మానలేదు. విభజన హామీలు నెరవేర్చాలని సీఎం జగన్ కోరారు.

First published:

Tags: Ap, Ap cm jagan, AP News, Cm jagan, Pm modi

ఉత్తమ కథలు