హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీచర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! టార్గెట్ ఎన్నికలేనా..?

టీచర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! టార్గెట్ ఎన్నికలేనా..?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) టీచర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీతాలు, ఇతర అంశాల విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులకు ఊరటనిచ్చింది. తాజాగా ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు కేటాయించకూడాదని నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) టీచర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీతాలు, ఇతర అంశాల విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులకు ఊరటనిచ్చింది. తాజాగా ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు కేటాయించకూడాదని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇకపై ఉపాద్యాయులు పూర్తిగి విద్యాబోధన పైనే తమ ధృష్టిని కేంద్రీకరించే వీలుంటుందని, ఎప్పటి నుండో తమపై అదనపు భారం తొలగించమని కోరుతున్న ఉపాధ్యాయుల కోరిక ఇన్నాళ్ళకు నెరవేరుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ప్రభుత్వ నిర్ణయంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏదో మాస్టర్ ప్లాన్ వేసిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రతిపక్షాల మాట మరోలా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనేతల పనులు అంటే జనాభా లెక్కలు, ఎన్నికల విధులు. జనగణన సంగతి పక్కనబెడితే.. ఎన్నికల విధుల నుంచి టీచర్లను దూరం చేయడానికే ఇలా చేసిందని ప్రతిపక్షాలంటున్నాయి. సీపీఎస్ రద్దు విషయంలో వైసీపీ సర్కార్ పై టీచర్లు మండిపడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓచోట ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఇది చదవండి: పొత్తులపై అప్పుడే నిర్ణయం.. నేతలకు పవన్ ఏం చెప్పారంటే..?

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛలో విజయవాడ పేరుతో భారీ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ ఎఫెక్ట్ తోనే అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తన పదవిని కోల్పోయారన్న ప్రచారమూ లేకపోలేదు. అప్పటి నుంచి ప్రభుత్వం తమైపై కక్షగట్టి వేధింపులకు గురిచేస్తోందని టీచర్లు మండిపడుతూనే ఉన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోగా.. బయోమెట్రిక్ హాజరు, నిముషం లేటు నిబంధనలు విధించడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్టులు చేయడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: ఆ నెలలోనే అసెంబ్లీ రద్దు.. ఎన్నికలు ఎప్పుడంటే..? నేతలకు సమాచారం అందిందా..?

ఈ నేపథ్యంలో టీచర్లు ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేయడంతో పాటు తమకు అనుకూలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు వేస్తే అన్నిరకాలుగా లాభం చేకూరుతుందనేది వైసీపీ ఆలోచన అని ప్రతిపక్షాలంటున్నాయి.

ప్రజల్లో వ్యతిరేకత వస్తే సంక్షేమ పథకాలు.. ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తే ప్లాన్ బి అమలు వంటి వ్యూహారన్ని వైసీపీకే సొంతమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాలంటీర్లు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇటీవలే పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగిస్తే తిరుగుండదని వైసీపీ భావిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP Politics

ఉత్తమ కథలు