హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: టీచర్ల ఉద్యమంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు దిశగా కీలక నిర్ణయం..

AP News: టీచర్ల ఉద్యమంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు దిశగా కీలక నిర్ణయం..

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సీపీఎస్ రద్దు (CPS) చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి స్పందన వచ్చింది. సీపీఎస్ రద్దుపై కొత్త కమిటీ వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సీపీఎస్ రద్దు (CPS) చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి స్పందన వచ్చింది. సీపీఎస్ రద్దుపై కొత్త కమిటీ వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఐదుగురు సభ్యలతో కమిటీ వేసింది. కమిటీ సభ్యులుగా సీఎస్ సమీర్ శర్మ, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సభ్యులుగా నియమించింది. మరోవైపు సీపీఎస్ పై చర్చించేందుకు సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్ధిక మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నుంచి బొప్పరాజు, సూర్యనారాయణ పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుదినివేదికను సీఎంకు అందజేస్తుంది.

  సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయసంఘాలు చేపట్టిన ఉద్యమంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ పై ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ నియమించిన కమిటీ సీపీఎస్‌ రద్దుపై సాధ్యాసాధ్యాలైన అన్ని అంశాలను పరిశీలిస్తోందని బొత్స తెలిపారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్‌పై మరింత క్లారిటీ వస్తుందన్నారాయన. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు. మంత్రుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోందని చెప్పినా.., ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం కరెక్టేనా? అని బొత్స ప్రశ్నించారు.

  ఇది చదవండి: యువతను ముంచింది ఆయనే.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా..

  ఉపాధ్యాయులు ఛలో సీఎంఓ ఆందోళనను చేపట్టడం సరి కాదన్న బొత్స.., శాంతిభద్రతలకు విఘాతం కలిగొంచొద్దని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో జరగరానిది జరిగితే ఎవరు బాధత్య వహిస్తారని ప్రశ్నించారు. ఆందోళనను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలను కాపాడలేకపోయిందని మళ్లీ వారే అంటారని చెప్పారు.

  ఇది చదవండి: మంత్రిగా తన మార్క్ చూపిస్తున్న రోజా.. ప్లేయర్ గా మారిన మినిస్టర్


  ఇదివరకు విజయవాడలో ఆందోళన చేపట్టారని, దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడిస్తామనడంలో అర్థం లేదని మంత్రి బొత్స అన్నారు. ప్రజలు గానీ, మీడియా గానీ దీన్ని సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమర్థనీయం కాదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: టీచర్లకు ప్రభుత్వం షాక్.. అప్పటివరకు సెలవులు లేవు.. కారణం ఇదే..!


  ఇదిలా ఉంటే సోమవారం యూటీఎఫ్ పిలుపునిచ్చిన ఛలో సీఎంఓ ఆందోళనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉపాధ్యాయులు విజయవాడ రాకుండా నగరం నలువైపుల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లపై నిఘా ఉంచారు. ఇక తాడేపల్లిలో పోలీసులను భారీగా మోహరించి ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే పంపారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు బస్సులను కూడా నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government

  ఉత్తమ కథలు