ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటకు సిద్దమయ్యారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మాటిచ్చి .. ఆంక్షలతో పేరుతో వేధిస్తోందని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu)విమర్శించారు. తాము రాయితీలను కూడా పోగొట్టుకొని ప్రభుత్వనికి సహాకరిస్తుంటే పాలకులు తమను చిన్నచూపు చూస్తున్నారని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ తీరును ఎండగడుతూ తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఏపీ అమరావతి జేఏసీ(AP Amaravati JAC) సమావేశమై. ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. వచ్చే నెల 9వ తేది నుంచి ఏప్రిల్(April) 5వ తేది వరకు చేపట్టబోయే కార్యక్రమాల షెడ్యూల్‌ని ప్రకటించారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే రెండో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
తాడో -పేడో ..
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. తమకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యోగులకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడ్డారు. విజయవాడలో సమావేశమైన ఏపీ అమరావతి ఉద్యోగ జేఏసీ నేతలు వచ్చే నెల రెండో వారం నుంచి చేపట్టబోయే నిరసన కార్యక్రమాల వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనల షెడ్యూల్ ..
మార్చి 8,9 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన
మార్చి 13,14 తేదీల్లో జిల్లా కలెక్టరెట్‌లు, ఆర్డీవో ఆఫీస్‌ల ముందు లంచ్ బ్రేక్‌లో ఆందోళనలు
మార్చి 15,17,20తేదీల్లో అన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జేఏసీలోని అన్నీ ఉద్యోగ సంఘాలతో ధర్నాలు
మార్చి 21నుంచి వర్క్ టు రూల్ (ఉ.10.30నుంచి సా.5గంటల వరకే పని)
మార్చి 21న ఉద్యోగుల సెల్ డౌన్,(యాప్‌లతో విధులు నిర్వహిస్తున్నందు ఈతరహా నిరసన)
మార్చి 24న రాష్ట్రంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫీసుల వద్ద ధర్నా
మార్చి 27న కరోనా సమయంలో, తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుబాలకు భరోసా
ఏప్రిల్ 1వ తేదిన ఏప్రిల్ ఫూల్ డే కాబట్టి (రిటైర్మెంట్, సర్వీస్ బెనిఫిట్స్‌పై పోరాటం)
ఏప్రిల్ 3న అన్నీ జిల్లాల్లో ఛలో స్పందన కార్యక్రమాలు..కలెక్టర్లకు మెమోరండం సమర్పణ
ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలు
సీఎం ఒక్కరే బాధ్యుడు..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపడుతున్న సుమారు నెల రోజుల ఉద్యమంపై ప్రభుత్వం దిగిరాకపోయినా..డిమాండ్ల సాధనకు కృషి చేయకపోయినా రెండో దశ ఉద్యమ కార్యాచరణను కూడా మొదలు పెడతామని ప్రకటించారు. ఇవన్నీ చేస్తున్నందున తమను శత్రువులుగా చూడవద్దని పాలకులకు విజ్ఞప్తి చేసారు ఉద్యోగ సంఘాల నేతలు. రేపు నిరసనల పేరుతో రోడ్డుపైకి వస్తే ..ఉద్యోగులను ఎందుకు రోడ్లపైకి తీసుకొచ్చని సీఎంను ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలని కోరుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Employees