AP POLITICS AP EX MINSTER NARAYANA AAREST IN 10 TH CLASS PAPER LEAKAGE CHITOOR SP SAYS WE HAVE PROOF NGS
10th Paper Leakage: మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేశామంటే? ఆధారాలు ఉన్నాయన్న ఎస్పీ? ఏమన్నారంటే?
పేపర్ లీకేజ్ వ్యవహారం
10th Paper Leakage: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ చేసింది నారాయణ విద్యా సంస్థలేనా...? యాజమాన్యమే మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తోందా..? మార్కుల కోసమే ఈ దందా ఎప్పటి నుంచో నడుస్తోందా..? పదో తరగతి పేపర్ల లీకేఝ్ కు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఎస్పీ ఏమన్నారంటే..?
10th Paper Leakage: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పదో తరగతి పేపర్ల లీకేజ్ (10th paper leakage).. మాస్ కాపీయింగ్ (Mass Copying) వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ ఇష్యూలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ (Ex Minster Narayana) అరెస్టుతో విషయం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కక్ష పూరితంగా నారాయణను అరెస్ట్ చేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన అరెస్ట్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి (Chitoor SP Risanth Reddy) .. పేపర్ల లీకేజ్ విషయంలో సంచలన విషయాలు ఆయన వెల్లండించారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అన్నారు. గత నెలలో తెలుగు క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనపై చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఆ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు ఎస్పీ. తమ విచారణలో విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలిందని ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించి ఆధారాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని.. ఎలాంటి ఆధారాలు లేకుండా తాము ఎవర్నీ అరెస్ట్ చేయలేదు అన్నారు.
అయితే ఇదంతా ఎందుకు చేశారో కూడా ఆయన వివరించారు. నారాయణ స్కూల్స్‌లో అడ్మిషన్స్ పెంచుకునేందుకు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ముఖ్యంగా తమ సంస్థల్లో చదివే విద్యార్థుల్లో ఎవరు కాస్త చదువులో వెనకబడి ఉంటారో వాళ్లు పరీక్షలు రాసే కేంద్రాలు.. అక్కడి ఇన్విజిలేటర్ల వివరాలను సిబ్బంది ముందే తెలుసుకుంటుంది అన్నారు. దానికి తగ్గట్టే.. ఇన్విజిలేటర్లు ముందుగానే ప్రలోభాలకు గురిచేస్తారని.. డబ్బులు ఇస్తున్నట్లు కూడా గుర్తించామని ఎస్పీ చెప్పారు. అక్కడున్న ఉపాధ్యాయులతో పేపర్ లీక్ చేయించి సమాధానాలు రాసి పంపిస్తారన్నారన్నారు. పేపర్ లీకైన వెంటనే సమాధానాలు రెడీ చేసి వాటర్ బాయ్స్, అటెండర్స్, ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్ధులకు అందజేస్తున్నట్టు విచారణలో తేలింది అన్నారు.
ఇప్పటి వరకువ ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు.. టెక్నికల్ ఆధారాలు, నిందితుల వాంగ్మూలం ఆధారం చేసుకున్న తరువాతే నారాయణను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే అరెస్ట్ చేసే ముందు నారాయణ పూర్తిగా సహకరించారని.. ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. శ్రీచైతన్య, ఎన్నారై వంటి సంస్థల పేర్లు కూడా ఈ వ్యవహారంలో బయటికొచ్చాయని.. అయితే ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది గతంలో నారాయణలో పనిచేసిన సిబ్బందేనని ఎస్పీ తెలిపారు. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు.
నారాయణ స్కూల్స్‌లో పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెనకబడి ఉంటారని.. సైన్స్, మ్యాథ్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తారని నిందితుల విచారణలో తెలిసిందన్నారు. అందుకే తెలుగు, హిందీ పేపర్లు లీక్ చేసినట్లుగా తెలుస్తోందన్నారు. ప్రధాన నిందితుడు గిరిధర్ అప్రూవర్‌గా మారారా? ఆయన ఏం వాంగ్మూలం ఇచ్చారనే ప్రశ్నలకు ఎస్పీ సమాధానాలు చెప్పలేదు. అయితే కేసు విచారణ దశలో ఉందని.. ఇప్పుడే అన్నీ చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ భార్యను కూడా అరెస్టు చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.