హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: కొడాలి నాని ఇక కాచుకో.. తొడగొట్టిన మాజీమంత్రి దేవినేని ఉమ

AP Politics: కొడాలి నాని ఇక కాచుకో.. తొడగొట్టిన మాజీమంత్రి దేవినేని ఉమ

మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (ఫైల్ ఫోటో)

మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (ఫైల్ ఫోటో)

Devineni Uma: కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో టీడీపీ నేతలు కొడాలి నాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనను ఓడించి తీరుతామని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆవేశానికి లోనయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలను టార్గెట్ చేసే వైసీపీ నేతల్లో అందరికంటే ముందండే నాయకుడు మాజీమంత్రి కొడాలి నాని. చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలను తనదైన శైలిలో విమర్శించే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ చేయని ప్రయత్నాలు లేవు. అయినా గుడివాడ నుంచి టీడీపీపై విజయం సాధిస్తూ.. ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతూ వస్తున్నారు కొడాలి నాని. ఈ క్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో కొడాలి నాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు(Devineni Uma maheshwara rao) ఆవేశానికి లోనయ్యారు. సాధారణంగా ఎఫ్పుడూ కూల్‌గా ఉండే దేవినేని ఉమ.. టీడీపీ నేతల మీటింగ్‌లో రెచ్చిపోయారు. కొడాలి నాని(Kodali Nani) ఇతర వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తొడ కొట్టారు. అంతేకాదు అక్కడే ఉన్న గుడివాడ(Gudivada) టీడీపీ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావును పిలిపించి మరీ తొడగొట్టించారు. దీంతో అక్కడున్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

  రెండు రోజుల క్రితం దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను గుడివాడకు వెళ్లకుండా పామర్రులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులలోనే డోర్ లాక్ చేసుకొని మూడు గంటలకు పైగా కూర్చొని నిరసనకు దిగారు మాజీ మంత్రులు. తమను గుడివాడకు వెళ్లకుడా పోలీసులు అడ్డుపడడాన్ని మాజీ మంత్రులు తప్పుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ కారు నుండి దిగకుండా కారు డోర్ లాక్ చేసుకొని కారులోనే కూర్చొని నిరసనకు దిగారు.

  కారు డోర్ ను ఓపెన్ చేసి మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. అంతకుముందు చంద్రబాబుతో పాటు లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.

  TDP: టీడీపీలో ఆ సీనియర్ నేత హవా ముగిసినట్లేనా..? చెక్ పెడుతున్న కీలక నేత..?

  Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?

  ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తే చంద్రబాబును ఇంటికి వచ్చి కూడ కొడతామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. ఈ విమర్శలపై టీడీపీ నేతలు మండిపడ్డారు కొడాలి నాని తీరును నిరసిస్తూ గుడివాడ వైపునకు వెళ్లే టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Devineni Uma Maheswara Rao, Kodali Nani, TDP

  ఉత్తమ కథలు