Home /News /andhra-pradesh /

AP POLITICS AP EX MINISTER SHANKAR NARAYANA BROTHERS RULE HIS CONSTITUENCY YSRCP CADRE UNHAPPY AK TPT

ఆ మాజీమంత్రికి తమ్ముళ్ల మైనస్ అవుతున్నారా ? వైసీపీలో విషయం అక్కడి వరకు వెళ్లిందా ?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Anantapuram: మంత్రిగా శంకర్ నారాయణ కొనసాగినంత కాలం పార్టీ నేతలు., కార్యకర్తలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారట. మంత్రివర్గం నుంచి శంకర్ నారాయణను తప్పించిన తరువాత వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...
  పెనుగొండ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని నియోజవర్గాల్లో ఓ వైపు ఉంటె....పెనుగొండ రాజకీయం మరోలా ఉంటుంది. ఇందుకు కారణం అక్కడ ఉన్న ఎమ్మెల్యే సహదారులే. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణది(Shankar Narayana) పెనుగొండ నియోజకవర్గం. ఇక్కడ తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా.. వెంటనే అదృష్టం కలసి వచ్చింది. 2019 జగన్ (YS Jagan)మొదటి క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ కొట్టేసారు. సామాజిక సమీకరణాలు అప్పట్లో ఆయనకు బాగా కలసి వచ్చాయి. ఎమ్మెల్యే టికెట్ రాకముందు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన శంకర్ నారాయణ... పెద్దగా విమర్శలు కొనితెచ్చుకోలేదు. అయితే మంత్రిగా (AP Minister) ప్రమాణం చేసిన నాటి నుంచి జిల్లాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అధిష్టానం వరకు పిర్యాదులు వెళ్లేలా వ్యవహరించారు.

  అసలు ఆయన అలా కావడానికి ఆయన ప్రత్యక్ష కారణం కాదు. అంతా ఆయన సోదరులే చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ నాయకుల కోపం, ఆగ్రహం అంతా వారిపైనే అంటూ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. శంకర్ నారాయణకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒకరు రవి కాగా, ఇంకొకరు మల్లికార్జున్. మంత్రి అయ్యాక శంకర్ నారాయణ పూర్తిగా బిజీబిజీగా గడిపేవారు. దీంతో నియోజకవర్గ స్థాయి పెత్తనం సోదరులు వద్దకు వెళ్లింది. చేతిలో అధికారం ఉంది కదా అని రవి మరింత దూకుడుగా వెళ్లేవారట. రాజకీయ కార్యక్రమాల్లోనే కాకుండా అధికారిక కార్యక్రమాలలో సైతం జోక్యం చేసుకొనే వారట. ఆ విధంగా నియోజకవర్గంలో మొత్తం పట్టు సాధించారని టాక్. పెనుకొండలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పని జరగాలన్నా శంకర నారాయణ సోదరులకు తెలియాల్సిందేనట. ఈ వైఖరి కొత్తలో బాగానే ఉన్నా.. రాను రాను శ్రుతిమించినట్టు చెబుతున్నారు. ఫలితంగా వైసీపీ లోకల్ లీడర్సే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది.  మంత్రిగా శంకర్ నారాయణ కొనసాగినంత కాలం పార్టీ నేతలు., కార్యకర్తలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారట. మంత్రివర్గం నుంచి శంకర్ నారాయణను తప్పించిన తరువాత వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ శంకర్ నారాయణ అన్నదమ్ముల్లో మార్పు రాలేదని టాక్. తాజాగా ఒక ఉద్యోగిని విషయంలో మాజీ మంత్రి సోదరులు వ్యవహరించిన విధానం వివాదాస్పదంగా మారింది. పెనుకొండ ఎంపిడిఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని బదిలీపై పరిగి మండలానికి వచ్చారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోతుంటే....అక్కడి ఎంపీడీవో షాక్ ఇచ్చారట. ముందుగా వెళ్లి శంకర నారాయణ సోదరుల పర్మిషన్ తీసుకోవాలని.. ఆ తర్వాత డ్యూటీలో చేరాలని చెప్పారని సమాచారం. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఆ మహిళా ఉద్యోగి భర్త కూడా వైసీపీ నాయకుడే. ఆయన శంకర నారాయణ వ్యతిరేకవర్గం కావడంతోనే అలా చేశారని నియోజవర్గంలో వార్త గుప్పుమంది. ఆ వర్గపోరు కారణంగా ఆ ఉద్యోగినికి అక్కడ పోస్టింగ్ క్యాన్సిల్ చేసి మడకశిర పంపేశారట.

  YCP Plenary 2022: ప్లీనరీలో సంచలన నిర్ణయం.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

  CM Jagan: చంద్రబాబుకు చిప్ ఉండాల్సిన చోట లేదు.. 175 సీట్లు మనవే.. ప్లీనరీ వేదికగా సీఎం ఎన్నికల నినాదం

  అన్నదమ్ములు ఇలాంటి వ్యవహారాలు చాలానే చేశారన్న అసంతృప్తి పెనుగొండ వైసీపీలో ఉందట. శంకర నారాయణ ఇద్దరు సోదరుల్లో రవి వైఖరిపైనే పార్టీ వర్గాలకు ఎక్కువ అభ్యంతరాలు ఉన్నాయట. ఆయన లక్ష్యంగానే సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నట్టు టాక్. తమ్ముడు..కుమ్ముడు అని గట్టిగానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని తెలుస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు