హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: చంద్రబాబు ‘గుడివాడ’ ప్లాన్.. కొడాలి నానికి అదే మైనస్ కానుందా ?

AP Politics: చంద్రబాబు ‘గుడివాడ’ ప్లాన్.. కొడాలి నానికి అదే మైనస్ కానుందా ?

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Gudiwada: వచ్చే ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకోవడంపై చంద్రబాబు చాలాకాలం నుంచి ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై చంద్రబాబు అనేక నివేదికలు తెప్పించుకుంటున్నారని.. ఈసారి మాత్రం గుడివాడలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరాలని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని ముందుకు సాగిపోవడమే రాజకీయ నాయకుడి లక్షణం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాంటి విషయాలు బాగా తెలుసు. పలుసార్లు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకుని తాను అనుకున్న ఫలితాలు సాధించారు చంద్రబాబు. అయితే కొంతకాలంగా ఆయన వ్యూహాలు పెద్దగా ఫలించడం లేదు. అంతేకాదు ప్రత్యర్థుల ధాటిని ఆయన, ఆయన పార్టీ వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. వైసీపీ నేతల మాటల దాడిని టీడీపీ కొంతకాలం తట్టుకోలేకపోయింది. అందులోనూ కొడాలి నాని వంటి వాళ్లు టీడీపీని తమదైన శైలిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే టీడీపీని వైసీపీ తరపున అందరికంటే ఎక్కువగా టార్గెట్ చేసిన కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ నెల 29 కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో టీడీపీ మినీ మహానాడు ఏర్పాటు చేస్తోంది. ఈ మినీ మహానాడు ప్రధాన లక్ష్యం.. మాజీమంత్రి కొడాలి నాని అని వేరే చెప్పనవసరం లేదు. కొడాలి నానిని గుడివాడలో ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది. అయితే టీడీపీని నిలువరించే విషయంలో కొడాలి నాని కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు కొడాలి నానికి మంత్రి పదవి లేకపోవడం పెద్ద మైనస్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. వైసీపీ, సీఎం జగన్ దగ్గర మంత్రి పదవి లేకపోయినా.. కొడాలి నాని పలుకుబడికి వచ్చే లోటు ఏమీ ఉండదు.

అయితే విపక్ష టీడీపీకి మాత్రం ఈ అంశం కలిసొచ్చే విషయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేసేవారు. కానీ మంత్రి పదవి పోయిన తరువాత మాత్రం ఈ విషయంలో ఆయన దూకుడు తగ్గిందనే వాదన ఉంది. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అయితే అప్పుడప్పుడు టీడీపీని విమర్శించేందుకు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు మాజీమంత్రి కొడాలి నాని. ఈ నెల 29న జరగబోయే మినీ మహానాడులో చంద్రబాబు కొడాలి నానిని ఏ విధంగా టార్గెట్ చేస్తారో అనే టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకోవడంపై చంద్రబాబు చాలాకాలం నుంచి ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై చంద్రబాబు అనేక నివేదికలు తెప్పించుకుంటున్నారని.. ఈసారి మాత్రం గుడివాడలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరాలని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు గుడివాడ టూర్ తరువాత కొడాలి నాని కూడా తనదైన శైలిలో రాజకీయాలు చేసే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా టీడీపీ విషయంలో కొడాలి నాని సైలెంట్ ‌ఉంటున్నారని.. కానీ చంద్రబాబు కొడాలి నానిని టార్గెట్ చేసిన తరువాత పరిస్థితి మళ్లీ మారిపోవచ్చనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి గుడివాడ మినీ మహానాడు తరువాత గుడివాడ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Gudivada, Kodali Nani

ఉత్తమ కథలు