Home /News /andhra-pradesh /

AP POLITICS AP EX DEPUTY CM PUSHPA SRIVANI FATHER IN LAW SATRUCHARLA CHANDRASEKHAR RAJU DIED WITH KIDNEY DISEASE SK

Satrucharla Chandrasekhar Raju: మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల మృతి.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుటుంబంలో విషాదం

పుష్ప  శ్రీవాణి, శత్రుచర్ల

పుష్ప శ్రీవాణి, శత్రుచర్ల

Satrucharla Chandrasekhar Raju: చంద్రశేఖర్ రాజు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి ఆయన మామ అవుతారు.

    ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి (Pamula Pushpa Sreevani) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు(Satrucharla Chandrasekhar Raju) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో  ఆయన బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ రాజు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు కురుపాం మండలంలోని చినమేరంగి కోటకు తరలించనున్నారు. చంద్రశేఖర్ రాజు టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు.  అంతేకాదు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి ఆయన మామ అవుతారు.

    Somuveeraju: 2024 ఎన్నికలకు ఆ రెండితోనే పొత్తు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ చీఫ్ సో

    గతంలో కాంగ్రెస్ (Congress) తరపున ఎమ్మెల్యేగా శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు (Nagur) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో కురుపాం (Kurupam)నియోజకవర్గం ఏర్పడింది.  2009లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కోడలు పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం  2018లో వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు చంద్రశేఖర్ రావు. 2019 ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి వచ్చారు. 2019లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి మళ్లీ గెలుపొందారు. అనంతరం  జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆమె తన పదవిని కోల్పోయారు.

    Vidadala Rajini: మహిళా మంత్రి గ్రాండ్ పార్టీ.. అనుకోని అతిథి రాకతో.. రాజకీయంగా ఆసక్తి

    గత కొన్ని నెలలుగా చంద్రదేశేఖర్ రాజు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై  విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇటీవల చంద్రశేఖర్ రాజు కుమార్తె , పుష్ప శ్రీవాణి ఆడపడచు పల్లవి కూడా టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇక శత్రుచర్ల కుమారుడు పరీక్షిత్ రాజు (Pariskhit Raju).. అరకు (Araku Parliament constituency )పార్లమెంటు వైఎస్సార్‌సీపీ ఇంచార్జిగా ఉన్నారు. కొంతకాలంగా పుష్ప శ్రీవాణికి, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజుకు రాజకీయంగా పడడం లేదు. ఈ విషయంలో తన భర్తకే మద్దతుగా నిలిచారు పరీక్షిత్ రాజు.  కాగా, శ్రత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతిపట్ల పలు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Pushpa srivani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు