Home /News /andhra-pradesh /

AP POLITICS AP EX CM KIRAN KUMAR REDDY ONCE AGAIN BECOME SILENT AFTER MEETING SONIA GANDHI IN DELHI FEW DAYS BACK AK

Kiran Kumar Reddy| Sonia Gandhi: కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు ఏం చెప్పారు ? మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తారు ?. అంతా సీక్రెట్

కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ (ఫైల్ ఫోటో )

కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ (ఫైల్ ఫోటో )

Andhra Pradesh: కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నంత సేపు ఆయన గురించి అనేక రకాలుగా మాట్లాడుకున్న వాళ్లు సైతం.. ఆయన ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆయన గురించి మాట్లాడటం మానేశారు.

    రాజకీయాల్లో రాణించడం అంత ఈజీకాదు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య ఎంపిక కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఎంపికైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరినా.. క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించడం లేదు. పేరుకు తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేలా కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజులు కిరణ్ కుమార్ వార్తల్లో నిలిచారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. సోనియాగాంధీతో(Sonia Gandhi)  సమావేశమయ్యేందుకు కొన్ని రోజులు వేచి ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది.

    కిరణ్ కుమార్ రెడ్డికి ఏదో ఒక రాష్ట్ర ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు.. ఆయనను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించే ఛాన్స్ ఉందని మరికొందరు భావించారు. కానీ అసలు తాను ఏ విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యాననే విషయాన్ని మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పలేదు. ఎంత సైలెంట్‌గా సోనియాగాంధీతో సమావేశమయ్యారో... అంతే సైలెంట్‌గా ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి.

    కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నంత సేపు ఆయన గురించి అనేక రకాలుగా మాట్లాడుకున్న వాళ్లు సైతం.. ఆయన ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆయన గురించి మాట్లాడటం మానేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో కిరణ్ కుమార్ ఏదో రకమైన బాధ్యతలు ఆశించారని.. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు అంగీకరించలేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారని భావిస్తున్నారు.

    Konaseema District: కోనసీమ ఘటన వెనుకున్నది అతడేనా..? వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం..

    Pawan Kalyan on Konaseema: ఇది ముమ్మాటికీ వైసీపీ కుట్రే.. కోనసీమ అల్లర్లపై పవన్ స్పందన..

    మరికొందరైతే.. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇలాంటి ఊహాగానాలు రావడం కొత్తేమీ కాదని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఏ విషయమైనా మరీ ఎక్కువ రహస్యంగా చేస్తారని.. అదే ఆయనకు మైనస్ అని మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏదో చెప్పడానికి ఆయన వచ్చారని.. కానీ అది వర్కవుట్ కాకపోవడం వల్లే ఆయన సైలెంట్ అయిపోయారని భావిస్తున్నారు. మొత్తానికి గతంలో పలుసార్లు వార్తల్లో నిలిచి మళ్లీ సైడైపోయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్.. మరోసారి అదే రకంగా సైడైపోయారనే చర్చ మొదలైంది. మరి.. మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ తెరపైకి ఎప్పుడు వస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు