హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్

అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్

చంద్రబాబు (File)

చంద్రబాబు (File)

Ayodhya Verdict: ఇక తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘ఇవాళ అయోధ్య కేసులో తీర్పు రానుంది. మతపరమైన అనుబంధాల వల్ల మనం దూరం కాకూడదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య కేసులో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం మరికాసేపట్లోతీర్పు వెలువరించనుంది. దీంతో దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు నాయకులంతా ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ మేరకు పిలుపునిచ్చారు. ఇక తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘ఇవాళ అయోధ్య కేసులో తీర్పు రానుంది. మతపరమైన అనుబంధాల వల్ల మనం దూరం కాకూడదు. మనమంతా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం , సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉందాం’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా అయోధ్య కేసు తీర్పుపై ట్వట్ చేశారు. అయోధ్య కేసుకు సంబంధించి జిల్లా కోర్టు మొదలుకుని, సుప్రీంకోర్టు వరకు అన్ని పక్షాల వాదనలు కోర్టులు వినడం జరిగింది. దేశ సామరస్యం, దేశ భవిష్యత్తు దృష్ట్యా తీర్పును గౌరవిద్దాం’ అంటూ ట్వీట్ చేశారు.

First published:

Tags: AP Politics, Ayodhya, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Chandrababu Naidu, Supreme Court, TDP

ఉత్తమ కథలు