హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బీజేపీతో విభేదించి తప్పు చేశాను... చంద్రబాబు పశ్చాతాపం

బీజేపీతో విభేదించి తప్పు చేశాను... చంద్రబాబు పశ్చాతాపం

చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ

చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ

బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లే టీడీపీ ఓటమి పాలైందన్న విషయం చంద్రబాబుకు తెలిసొచ్చిందా ?

  ఇటీవల విశాఖలో పర్యటించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో విభేధించి నష్టపోయామన్నారు. పట్టుదలకు పోకుండా ఉంటే ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. కేంద్రంతో విభేధించడం వల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు... అదే పరిస్థితుల్లో టీడీపీకి మాత్రం నష్టం జరిగిందన్నారు. దీంతో పాటు.. జనసేన అధినేత పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. అంతే తప్పా ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవన్నారు. అయితే చంద్రబాబు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  ఇన్నాళ్లు చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా...ఇన్నాళ్లు ఓటమికి కారణాలు తెలియడం లేదంటూ చెప్పుకొచ్చారు.పార్టీ ఏ విషయంలో ఓడిపోయిందో అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తుంటే... బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లే టీడీపీ ఓటమి పాలైందన్న విషయం చంద్రబాబుకు తెలిసొచ్చిందా ? లేక మరోసారి బీజేపీతో కలిసి వెళ్లడానికి బాబు ప్రయత్నిస్తున్నారా ? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యల వెనక మరో బలమైన కారణం కూడా ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

  ఇప్పటికే చాలామంది టీడీపీకి చెందిన సీనియర్లు, ఎంపీలు బీజేపీలోకి చేరిపోయారు. మరికొందరు చేరేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి చంద్రబాబు కమలం గూటికి దగ్గరవ్వలన్న ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు నేతలు ఆలోచనలో పడుతున్నారు. రేపోమాపో బీజేపీతో బాబు మళ్లీ చేతులు కలిపితే...అప్పుడు ఏ పార్టీలో ఉన్న ఒక్కటే. ఆ మాత్రం దానికి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎందుకులే అనుకుని కొందరు సైలంట్ అవుతారన్న వ్యూహంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు ఓటమికి కారణం తెలిసిందో ? లేక జ్ఞానోదయం అయ్యిందో తెలియదు కానీ... బీజేపీకి బాబు ఇన్ డైరెక్ట్‌గా మరోసారి పొత్తుకు సిగ్నల్ ఇస్తున్నారన్న విషయం మాత్రం తేలిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp, Bjp-tdp, Chandrababu Naidu, Pm modi

  ఉత్తమ కథలు