హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RSS చీఫ్‌తో చంద్రబాబు భేటీ.. కేంద్రమంత్రి రాయబారం చేశారా ?

RSS చీఫ్‌తో చంద్రబాబు భేటీ.. కేంద్రమంత్రి రాయబారం చేశారా ?

అయితే వీరిద్దరి భేటీకి సంబంధించిన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే వీరిద్దరి భేటీకి సంబంధించిన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే వీరిద్దరి భేటీకి సంబంధించిన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. నాగపూర్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ప్రధాన కార్యాలయంలో భగవత్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ సుమారు రెండు గంటల పాటు సాగినట్లు తెలిసింది. అయితే వీరిద్దరి భేటీకి సంబంధించి విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఏపీకి అన్యాయం చేశారంటూ చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కూటమి ఫెయిల్ కావడంతో తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలిసారి ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ... బాబు వ్యూహాలన్ని బెడిసికొట్టాయి.

    ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఒక సందర్భంలో కేంద్రంతో విభేదించి తప్పు చేశామని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. బహిరంగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా రాజకీయాలే చర్చకు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోంది. అయితే కేంద్రమంత్రి గడ్కరీ రాయబారంతో ఈ భేటీ జరిగిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న వాదన ఈ భేటీ కారణంగా మరోసారి తెరపైకి వచ్చింది. మరి బాబు భవిష్యత్తులో బీజేపీతో దోస్తీకి ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచిస్తారో చూడాలి.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp-tdp, Chandrababu Naidu, RSS, TDP

    ఉత్తమ కథలు