Home /News /andhra-pradesh /

AP POLITICS AP EX CHIEF MINISTER KIRAN KUMAR REDDY DECIDED TO STAY AWAY FROM POLITICS AND CONGRESS PARTY AK

Kiran Kumar Reddy: కిరణ్ కుమార్ రెడ్డి అసలేం చేస్తున్నారు ? కాంగ్రెస్‌ను మళ్లీ లైట్ తీసుకున్నారా ?

కిరణ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కిరణ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kiran Kumar Reddy: కొంతకాలం క్రితం చిత్తూరులోని తన సొంతూరులో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతానని.. అందరి సమస్యలు తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy).. రాష్ట్ర విభజన తరువాత చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. ఆయన పార్టీలో ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించలేదు. మిగతా కాంగ్రెస్(Congress) నేతలు అప్పుడప్పుడు ఏదో ఒక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆయన ఆశించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని(Sonia Gandhi) ఢిల్లీలో కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా కిరణ్ ఆమెతో ఏయే అంశాలు చర్చించారన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో ఏదైనా కీలక పదవి తనకు ఇవ్వాలని.. ఏదో ఒక రాష్ట్రానికి తనను ఇంఛార్జ్‌గా నియమించాలని ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సోనియాగాంధీతో సమావేశం తరువాత మళ్లీ మీడియాతో మాట్లాడలేదు కిరణ్. కానీ ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాను సూచించిన అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారా ? లేక మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారా ? అన్నది కూడా తెలియడం లేదు. కొంతకాలం క్రితం చిత్తూరులోని తన సొంతూరులో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతానని.. అందరి సమస్యలు తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో రాణించేందుకు వ్యూహరచన చేసుకున్నారనే వాదన వినిపించింది. కానీ అలా జరగలేదు. ఇటీవల కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా కనపించలేదు. దీంతో రాహుల్ గాంధీ యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి చేరుకున్నప్పుడైనా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా ? అన్న చర్చ జరుగుతోంది. CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకు ఆహ్వానం..! ఆపరేషన్ 175కి రేపు తొలి అడుగు Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ అందుకే రియాక్ట్ అయ్యారా ?.. టీడీపీకి ఛాన్స్ లేకుండా చేశారా ? ఒకవేళ అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉంటే.. ఆయన పార్టీకి దాదాపుగా దూరమైనట్టే అని భావించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఆయన తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు