AP Employees Protest: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వర్సెస్ ఉద్యోగుల ఫైట్ తీవ్రమైంది.. రేపటి నుంచి ఉద్యమానికి సిద్ధమయ్యారు ఉద్యోగులు.. ప్రస్తుతం చాలా ఉద్యోగ సంఘాలలో ఐక్యత లేకపోయినా.. ఉద్యోగులు (Employees) మాత్రం అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలంటున్నారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarulu). ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేలా.. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తామ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఉద్యమం ప్రకటన చేసి చాలా రోజులైనా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం శోచనీయమంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక నుంచి 10నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగం చేస్తామని బొప్పరాజు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల నిరసన జగన్ సర్కార్ కు చెంపపెట్టు అవుతుందా..?
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను జగన్ మోసం చేశారని కొన్నిసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఐఆర్ 27 శాతం ప్రకటించారని.. ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని ముందే హెచ్చరించామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల ఆగ్రహం జగన్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేయడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఉద్యోగ , ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఏపిజేఏసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తమ ఉద్యమానికి ఏపి సిపిఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలన్నారు. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే తమ ఉద్యమం అన్నారు.
ఇదీ చదవండి : మంచు మనోజ్, మౌనికతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రాజకీయాల్లోకి మంచు మనోజ్.. ఆయన ఆన్సర్ ఇదే
డిఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం దారుణం కాదా అని ప్రశ్నించారు. మూడు డిఏలు ఇప్పటికీ చెల్లించలేదు.. అలాగే రిటైర్ అయిన వారికి బకాయి చెల్లించలేదుని.. ఏడాదిగా పోలీస్ లకు సరండర్ లీవులకు చెల్లింపులు ఇవ్వలేదన్నారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేస్తే ..వారంరోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఏం చేశారని బొప్పరాజు ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు. న్యాయబద్దమైన తమ సమస్యలపై తప్పక పోరాటం చేయాలన్నారు. రేపటి నుంచి స్వఛ్ఛందంగా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు ఇఛ్చారు. తలో ఐక్యత వుందని చెప్పాలి అన్నారు. ఏపి ఎన్జీఓ జేఏసి కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు ప్రజల మద్దతు కావాలన్నారు ఆర్టీసీ జెఏసీ నేత వాలిశెట్టి దామోదర్. లిఖిత పూర్వక హామీ లభించే వరకు ఈసారి చర్చలకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Employees, Visakhapatnam