AP POLITICS AP DEPUTY CM NARAYNA SWAMY SAYS CM JAGAN HAD GOD QUALITIES AND HE CARRIED CM JAGAN PHOTO NGS
AP Deputy CM: స్వామి భక్తి అంటే ఇదే..? సీఎంను దేవుడు చేసిన డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
AP Deputy CM: స్వామి భక్తి చూపించడంలో ఆయన తరువాతే ఎవరైనా అనేలా గుర్తింపు తెచ్చుకుంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అధినేతను అంతలా ఆరాధించబట్టే ఆయనకు సెకెండ్ ఛాన్స్ దక్కిందేమో.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ ను.. దేవుడు చేశారు డిప్యూటీ సీఎం.
AP Deputy CM: సాధారణంగా తమిళనాడు (Tamilnadu) రాజకీయాల్లో స్వామి భక్తి ఎక్కువగా ఉంటుంది. పార్టీ అధినేతకు ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలు భక్తుల్లా వ్యవహరిస్తారు.. కాళ్లపై పడి దండాలు పెడతారు.. దేవుడిలా పూజిస్తారు.. ఇప్పుడిప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూడా ఆ సంప్రదాయం పాకుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ను ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు అతి స్వామి భక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో అయితే కాళ్లకు దండాలు పెట్టిన వీడియోలు వైరల్ (Viral Videos) అవుతూనే ఉన్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి అధినేతకు తామంతా భక్తులం అని చెప్పుకుంటారు కొందరు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్వామి (Venugopal Swamy) అయితే.. జర్నలిస్టులను ఉద్దేశించి మీ సమస్యలు తీరాలి అంటే.. జగన్ ను ఆరాధించాలని సలహా ఇచ్చారు. అంతేకాదు అలా ఆరాధించబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అయనకు రెండు రెట్లు అన్నట్టు ఉంది డిప్యూటీ సీఎం నారాయణ పరిస్థితి. ఆ మధ్యం సీఎం జగన్ (CM Jagan), ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) బొమ్మలతో ఉన్న ఉంగరాలను ధరించి అధినేత చూపు తనవైపు పడేలా చేసుకున్నారు. తాజాగా జగన్ ను ఏకంగా దేవుడిలా మార్చేశారు..
సీఎం జగన్ తొలి కేబినెట్ లో ఎస్సీ కేటగిరీలో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించిన ఆయన .. రెండో కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదా పొందారు. అదే హోదా -అదే శాఖలో కంటిన్యూ అవుతున్నారు. ఈ క్రమంలో రెండోసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయన.. దేవుడి ఫొటో స్థానంలో సీఎం జగన్ ఫొటోతో ఛాంబర్ లోకి ప్రవేశించారు. దేవుళ్లలో ఉండే లక్షణాలు అధినేత జనగ్ లో ఉన్నాయి అన్నారు. అందుకే తనకు రెండో సారి మంత్రిగా అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. అందుకే జగన్ ఫొటోతో ప్రవేశించాను సీఎం జగన్ ఆశయాలతో ముందుకెళ్తామని చెప్పారు. దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్.. అందుకే ఆయన ఫొటో పట్టుకునే చాంబర్లోకి ప్రవేశించానని చెప్పారు.
సీఎం జగన్ తన మీద పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేసారు. ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దు.. సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. ఇది రెడ్ల రాజ్యం కాదని చెబుతూ... బడుగుల రాజ్యంగా అభివర్ణించారు. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూసిన తరువాత తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.