హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Congress: ఆర్థిక కష్టాల్లో ఏపీ కాంగ్రెస్.. హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్

AP Congress: ఆర్థిక కష్టాల్లో ఏపీ కాంగ్రెస్.. హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్

కాంగ్రెస్ (ప్రతీకాత్మక చిత్రం)

కాంగ్రెస్ (ప్రతీకాత్మక చిత్రం)

Congress: ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉనికిలో లేకపోయినా.. ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్య నగరాలు, పట్టణాల్లో ఇంకా కాంగ్రెస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్‌లో ఉన్న కొద్దిమంది నాయకులు కూడా ఆ పార్టీని పట్టించుకోవడం లేదు. ఏపీలో(Andhra Pradesh) రాజకీయంగా ఇబ్బందిపడుతున్న కాంగ్రెస్‌ను ఇప్పుడు ఆర్థిక కష్టాలు కూడా తోడయ్యాయి. ఏపీలో కాంగ్రెస్(congress) పార్టీ రాజకీయంగా ఉనికిలో లేకపోయినా.. ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్య నగరాలు, పట్టణాల్లో ఇంకా కాంగ్రెస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే వాటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు మాత్రం చెల్లించేవారు లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఆఫీసులకు రూ. 1.40 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆ పార్టీకి నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో లేదు. దీంతో ఈ బకాయిలపై ఏఐసీసీ ట్రెజరర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు లేఖ రాశారు.

ఈ బకాయిలు చెల్లించేందుకు నిధులు అందించాలని అందులో పేర్కొన్నారు. అయితే ఏఐసీసీ మాత్రం ఏపీ పీసీసీ చీఫ్ లేఖకు సానుకూలంగా స్పందించలేదు. ఈ నిధులు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేయలేదు. స్థానికంగానే నిధులు సమకూర్చుకోవాలని ఏపీ పీసీసీకి స్పష్టం చేసింది.

Nara Lokesh: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన నారా లోకేశ్, బ్రాహ్మణి..!

Good News: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి పిల్లలకు పౌష్టికాహారం.. ప్రారంభించిన సీఎం జగన్

దీంతో చేసేది లేక ఆస్తి పన్ను చెల్లించేందుకు నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలనే దానిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఫోకస్ చేశారు. ఇందుకోసం పార్టీ సీనియర్లను, సానుభూతిపరులను ఆయన విరాళాలను అడుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం.. ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Congress

ఉత్తమ కథలు