ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) మంగళవారం ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన హస్తిన వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని, రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) మంగళవారం ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన హస్తిన వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని, రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) ను కలవనున్నారు. ఇప్పటికే వారి అపాయింట్మెంట్లు ఖరారు అయినట్లు సీఎంఓ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రదాని, హోం మంత్రితో చర్చించాల్సిన అంశాలను జగన్ ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి, 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశముంది. అలాగే పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల వంటి అంశాలతోపాటు విభజన చట్టంలోని అపరిష్కృత హామీల అమలుపైనా సీఎం ప్రధానితో చర్చిస్తారని సమాచారం.
మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల అంశాన్ని కూడా మోదీ లేదా షా దృష్టికి జగన్ తీసుకెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హైకోర్టు తీర్పులో ఇచ్చిన గడువు, ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యం, అవసరం వంటి అంశాలను వారికి వివరించే అవకాశముంది. అలాగే ఏపీలో పొత్తుల విషయంపైనా చర్చిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉండటం, టీడీపీ కూడా కూటమిలో చేరేందుకు యత్నిస్తుండటంతో జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఏపీలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా ఉంది. అప్పులు రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీయడం తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రాలు ఇలా అప్పులు పెంచుకుంటూ పోతే.. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్టే భారత దేశంలోనూ ఇబ్బంది తప్పదని.. భారత్ లోని బ్యూరోక్రాట్లు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రాత్రి ప్రధానమంత్రి మోదీ..ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ముఖ్య్గంగా కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాల పేరుతో భారీగా అప్పులు చేస్తున్నాయని.. ఆ ప్రభావం దేపైనా పడుతుందని హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయం కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ సైతం అక్కడే ఉన్నట్టు టాక్.. ఈ నేపత్యంలో ప్రధాని మోదీని సీఎం జగన్ భేటీ.. రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.