Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN TO MEET PARTY ACTIVISTS FROM AUGUST 4TH AS HE STARTING FROM KUPPAM FULL DETAILS HERE PRN

YS Jagan: నేటి నుంచి సీఎం జగన్ కొత్త మిషన్.. చంద్రబాబు నియోజకవర్గం నుంచే మొదలు..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడంతో పాటు వైసీపీ (YSRCP) కోసం పనిచేస్తున్నవారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ బలోపేతంపైనా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాదాపు రెండు నెలలకు పైగా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడంతో పాటు వైసీపీ (YSRCP) కోసం పనిచేస్తున్నవారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈమేరకు ఆగస్టు 4 నుంచి అంటే గురువారం నుంచే ఈ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు జగన్.

    ఇందుకోసం జగన్.. టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నియోజకవర్గాన్నే ఎంపిక చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి కుప్పం నుంచి నేతలు కార్యకర్తలను పిలిపించారు. కుప్పంలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నాం.. సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నామనే అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకునే అవకాశముంది. అలాగే కుప్పంలో గెలవాలంటే ఎలా ముందుకెళ్లాలని.. టీడీపీ వైపున్న ఓట్లను ఎలా మనవైపు తిప్పుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ప్లస్ అయిన అంశాలేంటనే విషయాలపై సీఎం చర్చించే అవకాశముంది. సామాన్య కార్యకర్తలకు కూడా పార్టీలో అవకాశాలు వస్తాయని.. కష్టపడి పనిచేసి మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

    ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు.. వివరాలివే..!


    2024లో మిషన్ 175 లక్ష్యంతో పనిచేస్తున్న వైసీపీ.. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇందుకోసం గత మూడేళ్ల నుంచే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో వైసీపీ నేతలను ప్రోత్సహిస్తూ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో మంచిఫలితాలు తీసుకొచ్చారు. ఇప్పుడు నేరుగా జగన్ రంగంలోకి దిగనుండటంతో కుప్పంలో సమీకరణాలు మారతాయని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలంటున్నారు.



    ఇదిలా ఉంటే కార్యకర్తలతో  భేటికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిదశలో చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా హిందూపురం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, విశాఖలో నార్త్, తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, పశ్చిమ గోదావరి పాలకొల్లు, ఉమ్మడి కృష్ణాలో విజయవాడ ఈస్ట్ వంటి నియోజకవర్గాలను ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా వైసీపీ కోల్పోయిన నియోజకవర్గాలపై దృష్టిపెట్టి.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వీక్ గా ఉన్న స్థానాలపై దృష్టిపెట్టే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు