Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN SLAMS OPPOSITION PARTIES ON NEGATIVE PROPAGANDA ON WELFARE SCHEMES IN THE STATE FULL DETAILS HERE PRN

YS Jagan: ఆ పథకాలన్నింటికీ బ్రేక్.. వారి లక్ష్యం అదే.. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు..

ఒంగోలులో మాట్లాడుతున్న సీఎం జగన్

ఒంగోలులో మాట్లాడుతున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan).. ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచారు. శుక్రవారం ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan).. ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచారు. శుక్రవారం ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందుకే టీడీపీ అనుకూల మీడియాలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటంతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు సంక్షేమ పథకాలన్నీ నిలిపేస్తామంటే ఒప్పుకుంటారా అంటూ అక్కడున్నవారిని ప్రశ్నించారు. వాళ్లు అధికారంలోకి వస్తే పేదలకు సంక్షేమ పథకాలు, ఇళ్లు వంటి పథకాలన్నింటినీ నిలిపేస్తామంటున్నారని.. ప్రజలకు మంచి జరుగుతుంటే సహించలేని వారిని నమ్మొద్దని సీఎం అన్నారు. ప్రజల కోసం దుష్టచతుష్టయంతో పోరాడుతున్నామన్నారు.

    ప్రతి ఏటా తల్లుల కోసం అమలు చేస్తున్న అమ్మఒడి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకిచ్చే వైఎస్ఆర్ చేయూత, అలాగే కాపునేస్తం, ఈబీసీ నేస్తం, భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, ఉచిత ఇళ్ల వంటి పథకాలన్నీ నిలిచిపోవాలనేదే ప్రతిపక్షాల లక్ష్యమని జగన్ విమర్శించారు. ఆ పథకాలన్ని కావాలో వద్దో ప్రజలే నిర్ణయించాలన్నారు.

    ఇది చదవండి: విజయవాడ గ్యాంగ్ రేప్ పై సీఎం సీరియస్.. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం..


    "ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడిని అడుగుతున్నా.. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా అని నిలదీయాలని.. ఇలాంటి వాళ్లు రాజకీయ పార్టీలు నడపడానికి అర్హులేనా..? వీళ్లంతా ప్రజాజీవితంలో ఉండటానికి అర్హులా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఒకటే, అప్పులు ఒకటేనని జగన్ గుర్తు చేశారు. అప్పులు, ఆదాయాలు ఒకేలా ఉన్నా.. జగన్ ఎందుకు మంచి చేస్తున్నాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేదో చెప్పాలి" అన్నారు.

    ఇది చదవండి: ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు..? అధిష్ఠానానికి పీకే సూచన.. జగన్ ఒప్పుకుంటారా..?


    జగన్ బటన్ నొక్కి నేరుగా ప్రజల ఎకౌంట్లో వేస్తున్నాడన్న సీఎం.., చంద్రబాబు మాత్రం ఆయనకు మంచి చేసుకునేందుకే పరిపాలన సాగిందని ఎద్దేవా చేశారు. అదే బడ్జెట్, అవే వనరులు, అంతకంటే తక్కువ అప్పులతో చంద్రబాబుకంటే గొప్పపాలన అందిస్తున్నానని జగన్ చెప్పారు.

    ఇది చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. 2500 మందికి ఉద్యోగాలు


    బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రాజకీయ పదవులిచ్చామన్నారు. విజయవాడ మేయర్ జనరల్ అయినా బీసీ మహిళకు ఇచ్చామని, అలాగే కృష్ణా జెడ్పీ చైర్మన్ కూడా బీసీ మహిళకే ఇచ్చామన్నారు. అలాగే దుర్గగుడి ఆలయ ఛైర్మన్ పదవిని కూడా బీసీకే ఇచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లా పరిషత్ ఛైర్మన్లలో 9మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చామన్నారు. ప్రభుత్వం అందరికీ మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు