Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN SLAMS CHANDRABABU AND PAWAN KALYAN OVER CRITICISM FULL DETAILS HERE PRN GNT

YS Jagan: "అలా చేస్తే గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారు.. దొంగలముఠాతో జాగ్రత్త.." ప్రతిపక్షాలపై జగన్ సెటైర్లు..

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

ప్రతిపక్షాలపై సీఎం జగన్ (CM YS Jagan) ఫైర్ అయ్యారు. నరసరావుపేటలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.., కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారం, విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రతిపక్షాలపై సీఎం జగన్ (CM YS Jagan) ఫైర్ అయ్యారు. నరసరావుపేటలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.., కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారం, విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వారికి భయం పట్టుకుందని.. బాక్సులు బద్దలవుతాయనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు అయన దత్త పుత్రుడు కొత్త ప్రచారం అందుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు దొంగలు ముఠా.., ఎన్నికల అయున తరువాత హైదరాబాద్ (Hyderabad) పారిపోయిందని ఎద్దేవా చేశారు. వాళ్లలా చేస్తే రాష్ట్రం అమెరికా (America) అవుతుందని.. మన పథకాలు అమలు చేస్తే శ్రీలంక (Sri Lanka) అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాష్ట్ర ఖజానాకు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు.

    "ప్రధానితో గంట సేపు బేటి అయితే... ఆయన క్లాస్ పీకారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు.. ప్రధానితో భేటీలో నేను తప్ప ఎవరూ లేరు.. ప్రధాని రూమ్ లో మోదీ సోఫా కింద లేదా నా సోఫా కింద కూర్చున్నారా..? అసూయకు మందు లేదని.., అది మంచిది కాదు.. అలాగే ఉంటే త్వరగా బీపీలు, షుగర్ వచ్చి టికెట్ తీసుకుంటారు" అంటూ సీఎం విమర్శలు చేశారు. స్ట్రైట్ గా యుద్ధం చేయలేక మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారన్న జగన్ చెప్పిన అబద్దాలనే వందసార్లు చెబుతున్నారని.. ఈ గజదొంగల ముఠాకు అధికారం తప్ప వేరే ఎజెండా లేదని మండిపడ్డారు. రాష్ట్రం ఎప్పుడు బావుందో ప్రజలే ఆలోచించుకోవాలని.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, వారి అనుకూల మీడియా మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: నా సైన్యానికి సెల్యూట్.. వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం..

    అంతకుముందు సీఎం జగన్ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సత్కరించారు. నా సైన్యానికి సెల్యూట్ అన్న జగన్.. వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న చిరుసత్కారాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిఏటా సత్కరిస్తున్నామన్నారు. 4,136 వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20వేల నగదు, శాలువా సత్కరించి మెడల్ ఇస్తున్నామన్నారు. సేవా వజ్ర అవార్డు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 875 మందికి సేవా వజ్ర అవార్డు కింద రూ.30వేల నగదు, మెడల్, శాలువాతో సత్కరిస్తున్నట్లు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics

    తదుపరి వార్తలు