Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN SETS NEW TARGET FOR 70 MLAS TO INCREASE THEIR GRAPH BEFORE ELECTIONS FULL DETAILS HERE PRN BK

YSRCP: 70 మంది ఎమ్మెల్యేలకు జగన్ కొత్త టార్గెట్... తేడా వస్తే నో టికెట్.. లిస్ట్ ఇదేనా..?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహాన్ రెడ్డి (AP CM YS Jagan) ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అన్ని వ్యూహాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు నిర్ణ‌యం కూడా ఇందులో భాగంగానే తీసుకున్నార‌నే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  M Bala Krishna, News18, Hyderabad

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహాన్ రెడ్డి (AP CM YS Jagan) ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అన్ని వ్యూహాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు నిర్ణ‌యం కూడా ఇందులో భాగంగానే తీసుకున్నార‌నే వాదనలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టివ‌ర‌కు రెండుసార్లు పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టార్గెట్ ఎంటో వాళ్ల‌కి స్పష్టం చేశారు. తాజాగా పీకే రిపోర్ట్ ఆధారంగా జ‌గ‌న్ కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పీకే రిపోర్ట్ ఆధారంగా దాదాపు 70 మంది ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేపై వారి వారి నియోక‌వ‌ర్గాల్లో పూర్తి వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్ని జ‌గ‌న్ అనుకున్న‌ట్లు జ‌రిగితే న‌వంబ‌ర్లో అసెంబ్లీ రద్దు చేసి వ‌చ్చే ఏడాది మార్చికి ఎన్నిక‌లు ఉండేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తోన్నారు.

  అయితే ఇప్పుడు పీకే రిపోర్ట్ పై జ‌గ‌న్ ఫుల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం పెద్ద‌గా లేక‌పోవ‌డంతో వీళ్ల‌కి వారివారి నియోక‌వ‌ర్గాల్లో గ్రాఫ్ పెంచుకోక‌పోతే ఎన్నిక‌ల్లో వారి స్థానాల్లో కొత్త వ్య‌క్తుల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని జ‌గ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెబుతున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఈ 70 మంది ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లోనే వారి నియోక‌వ‌ర్గాల్లో ఉండి త‌మ గ్రాఫ్ పెంచుకొని చూపించాల‌ని జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. మరో సంక్షేమ పథకానికి శ్రీకారం.. వివరాలివే..!


  ఈ 70 మందిలో ఎంతమందిపై ప్ర‌జ‌ల్లో అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉందో వారిని మొద‌టి లిస్ట్ గా జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వీరిలో కొంతమంది గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నారు. మ‌రికొంత మంది మాత్రం అక్క‌డ‌క్క‌డ వారికి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద‌గా పాల్గొన‌డం లేదు.

  ఇది చదవండి: ప్లేస్ మీరు చెప్పినా.. నన్ను చెప్పమన్నా.. అదే నిజమైతే రాజకీయాలు వదిలేస్తా.. మాజీ మంత్రి ఛాలెంజ్


  అయితే ఇలా ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాల‌ను స్కిప్ చేసిన వారిపై కూడ జ‌గ‌న్ ఒక క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వ‌చ్చే న‌వంబ‌ర్లో జ‌గ‌న్ ఎట్టిప‌రిస్థితిల్లో కూడా అసెంబ్లీ ర‌ద్దు చేస్తార‌నే చర్చ పార్టీ ముఖ్యనేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అప్ప‌టిక‌ల్లా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ మేర‌కు త‌మ మార్కులు పెంచుకుంటార‌నేదే ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.

  ఇది చదవండి: ఆ ఏరియా అంతా స్వీప్ చేయాల్సిందే.. నేతలకు చంద్రబాబు కొత్త టార్గెట్..


  మ‌రోవైపు అప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేక‌పోతే వారి స‌మ‌క్షంలోనే వారి స్థానంలో కొత్త నాయ‌కుల‌కు అవ‌కాశం జ‌గ‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ నిర్ణ‌యాన్ని నేరుగా జ‌గ‌నే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. “మీకు గ‌తంలో ఉన్న నేత ఆశించినంత‌గా ప‌ని చేయ‌లేదు... ఆ విష‌యం నాకు తెలుసు అందేకే ఆయ‌న స్థానంలో ఇత‌నికి అవ‌కాశం ఇస్తgన్నాను గెలిపించండి మీకు అన్ని విధాల అండ‌గా ఉంటాడు” అనే నినాధంలో జ‌గ‌న్ ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం.  మ‌రోవైపు టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే వాళ్లు పార్టీకి రెబెల్ నేత‌ల‌గా కాకుండా ఉండ‌డానికి ఇప్ప‌టినుంచే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వారు చేసిన అవినీతి ఇత‌ర వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన చిట్టా మొత్తం ముందు పెట్టుకొనే జ‌గ‌న్ నేత‌ల‌తో మాట్లాడ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ 70 ఎమ్మెల్యేల్లో జ‌గ‌న్ టార్గెట్ ఎంత మంది రీచ్ అవుతారో చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు