హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan : ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తారా..? పీకేయమంటారా..? ఏపీ మంత్రులకు సీఎం జగన్ గట్టి వార్నింగ్

YS Jagan : ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తారా..? పీకేయమంటారా..? ఏపీ మంత్రులకు సీఎం జగన్ గట్టి వార్నింగ్

మంత్రులపై జగన్ సీరియస్

మంత్రులపై జగన్ సీరియస్

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర మంత్రులపై సీరియస్ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం వాడీవేడిగా జరిగినట్టు సమాచారం అందుతోంది. కేబినెట్ సమావేశం ప్రారంభం అయినప్పటినుంచే జగన్ మంత్రులపై అసహనంతో కనిపించినట్టు తెలుస్తోంది. పలు సందర్భాలను ప్రస్తావిస్తూ.. మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Read Also : పెదకూరపాడులో పొలిటికల్‌ వార్‌..! ఎస్‌ టాక్స్‌ నీదంటే నీదంటూ రగడ

ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి మంత్రులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తన కుటుంబసభ్యులపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటే ఎందుకు తిరిగి ప్రశ్నించడం లేదని మంత్రులను సూటిగా జగన్ ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ఇష్యూతో అపోజిషన్ లీడర్లు.. అధికార పార్టీపైనా, ప్రభుత్వంపైనా బురద జల్లుతున్నా కూడా మంత్రులు పట్టించుకోరా అని జగన్ నిలదీసినట్టు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేయమంటారా? అంటూ హెచ్చరిక కూడా చేసినట్టు చెబుతున్నారు.

Read This : సెల్ ఫోన్ దొంగలను పట్టుకుంటే.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు..!

గతంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం సమయంలో.. జగన్ కాస్త ప్రశాంతంగానే కనిపించినా.. ఈసారి మాత్రం పూర్తి అసహనం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇదే తీరు కొనసాగితే .. కనీసం నలుగురు మంత్రులనైనా మార్చుతానని జగన్ హెచ్చరించినట్టు నేతలు అంటున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరించిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శల దాడి పెంచాయని.. దానిని తిప్పికొట్టడంలో కొత్త మంత్రులు, పాత మంత్రులు విఫలం అవుతున్నట్టు జగన్ పాయింట్ ఔట్ చేశారని చెబుతున్నారు.

కుప్పం సంఘటనలు, పోలవరం సహా పలు అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను పలువురు మంత్రులు సరిగా కౌంటర్ చేయలేదని జగన్ చెప్పినట్టు తెలిసింది. లోకేశ్ విమర్శలను కూడా అంబటి రాంబాబు కౌంటర్ చేయలేకపోతున్నారని జగన్ చెప్పినట్టు వినికిడి. మీడియా ముందుకు ఆదిమూలపు సురేష్ రావడమే మానేసినట్టు జగన్ గుర్తుచేసినట్టు సమాచారం.

ఏపీ కేబినెట్ మీటింగ్ లో కొద్దిసేపు మాత్రమే విధాన పరమైన నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎక్కువ సేపు జగన్ మంత్రులకు క్లాస్ పీకడంపైనే ఫోకస్ చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

Published by:V. Parameshawara Chary
First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Cm jagan, Ys jagan

ఉత్తమ కథలు