ఏపీలో నేటి నుంచి వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. గురువారం నుంచి ప్రారంభం కాబోయే ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న జగన్ సర్కార్(YS Jagan).. మూడు రాజధానుల అంశంపై కూడా చర్చ చేపట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు(Three Capitals) ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే పలు న్యాయపరమైన సమస్యల కారణాలు అది ఆచరణకు నోచుకోలేదు. అయితే మూడు రాజధానుల ఏర్పాటే తమ విధానమని వైసీపీ పదే పదే ప్రకటిస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా అసెంబ్లీలో(AP Assembly) కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని.. దీనిపై సభలో స్వల్పకాలిక చర్చ ఉండబోతోందని సమాచారం. హైదరాబాద్ వంటి నగరంలో అభివృద్ధి అంతా ఒకే చోట జరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి. తద్వారా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయిందనే అంశాలపై సీఎం జగన్ వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండటంతో.. దీనిపై కేవలం చర్చ చేపట్టి సరిపెడతారా ? లేక ఏదైనా బిల్లు తీసుకొస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ అంశంలో ఏపీ ప్రభుత్వానికి టార్గెట్ చేసేందుకు విపక్ష టీడీపీ కూడా గట్టిగానే సిద్ధమవుతోంది. అసెంబ్లీకి రాకపోయినా.. సభలో అనుసరించాల్సిన విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల..? ఏ రోజు.. ఏ సేవ..? ప్రత్యేకత ఏంటంటే..?
Breaking News: మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?
మూడు రాజధానుల ప్రస్తావనను ప్రభుత్వం మరోసారి సభలో తీసుకొస్తే ఏ రకంగా తిప్పికొట్టాలనే దానిపై పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటే.. దీనిపై అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ డిమాండ్ చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.