హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్ పెట్టనున్న జగన్.. ఈ రోజే ఇంఛార్జ్ ప్రకటన ?

YSRCP: ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్ పెట్టనున్న జగన్.. ఈ రోజే ఇంఛార్జ్ ప్రకటన ?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

AP Politics: కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ సర్కార్ యోచిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో ఇంఛార్జ్‌ను నియమించే ప్రక్రియపై ఆ పార్టీ నాయకత్వంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌తో(YS Jagan Mohan Reddy) ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు సీఎం జగన్‌తో సజ్జల, హోంశాఖ సెక్రటరీ భేటీ కావడంతో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హోంశాఖ ప్రకటన చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ దీనిపై హోంశాఖ నుంచి ఎలాంటి ప్రకటన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆనం రామనారాయణరెడ్డి విషయంలో వ్యవహరించిన విధంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనూ వ్యవహరిస్తే సరిపోతుందనే యోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్టు టాక్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ తరపున ఇంఛార్జ్‌ను నియమించేందుకు సిద్ధమైన సీఎం జగన్ .. ఇందుకోసం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి (Anam Vijaykumar Reddy) పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లోపు ఈ ఇద్దరిలో ఒకరిని నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపినా.. తాజాగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును వైసీపీ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంఛార్జ్‌గా నియమించే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసే యోచనలో వైసీపీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీలో అసమ్మతి రాగం.. ఎమ్మెల్యేల కామెంట్స్ దేనికి సంకేతం..?

Pawan Kalyan: జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్ల దాడి..ధనిక సీఎం పాలనలో పేద ఏపీ అంటూ..

మరోవైపు కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ సర్కార్ యోచిస్తోంది. ఈ విషయంలో హోంశాఖ ప్రకటన ఇస్తే.. ఈ వివాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనే భావనలో జగన్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కోటంరెడ్డికి పార్టీ నేతల ద్వారానే కౌంటర్ ఇప్పిస్తే సరిపోతుందని అనుకుంటున్నట్టు సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kotamreddy sridhar reddy

ఉత్తమ కథలు