హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: చంద్రబాబు చేసిన పెద్ద స్కామ్.. ఇవిగో ఆధారాలు.. అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: చంద్రబాబు చేసిన పెద్ద స్కామ్.. ఇవిగో ఆధారాలు.. అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

AP News: విదేశాల నుంచి షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి సొమ్ము రాష్ట్రానికి వచ్చిందన్న సీఎం జగన్... వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371కోట్లు కొట్టేశారని విమర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ చరిత్రలోనే స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్ అతిపెద్దదని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్‌ ఇది అని ఆరోపంచారు. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సీఎం జగన్ విమర్శించారు. ఈ స్కామ్‌లో రూ.371 కోట్లు రూపాయలను మాయం చేశారని విమర్శించారు. ఈ డబ్బులను షెల్‌ కంపెనీ ద్వారా మళ్లించారని ఆరోపించారు. ఇది పక్కా స్కిల్‌డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్‌ అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఈ స్కామ్‌ ఏపీలో మొదలై విదేశాలకు పాకిందని ఆరోపించారు. విదేశాల నుంచి షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి సొమ్ము రాష్ట్రానికి వచ్చిందన్న సీఎం జగన్... వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371కోట్లు కొట్టేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కాం ఊపిరిపోసుకుందని సీఎం జగన్ అన్నారు. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

సీమెన్స్‌ అనే ప్రైవేటు సంస్థ రూ.3వేల కోట్లు ఇస్తుందని అప్పట్లో ప్రచారం చేశారని.. . ఒక ప్రైవేటు కంపెనీ ఎక్కడైనా రూ. 3వేల కోట్ల గ్రాంట్‌ ఇస్తుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. సీమెన్స్‌ కంపెనీలోని వ్యక్తితో లాలూచీపడ్డారన్న సీఎం జగన్... చంద్రబాబు అన్ని నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. ఆరు క్టస్టర్లు ఏర్పాటు చేస్తామని ఇందుకు సంబంధించిన జీవోలో చెప్పారని సీఎం జగన వివరించారు. ఒక క్లస్టర్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని... మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్‌ ఇస్తుందని జీవోలో చెప్పారని పేర్కొన్నారు. 90 శాతం సీమెన్స్‌, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. సుమారు 3వేల కోట్లు సీమెన్స్‌ ఇస్తుందని ప్రచారం చేశారని అన్నారు. కేబినెట్‌ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారని ఆరోపించారు. 3 నెలల కాలంలోనే ఐదు దఫాలుగా రూ.371 కోట్లు విడుదల చేశారని.. చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? అని ప్రశ్నించారు.

తాను బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే.. చంద్రబాబు బటన్‌ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము జమ అయ్యిందని సీఎం జగన్ ఆరోపించారు. డబ్బును గ్రాంట్‌గా ఇస్తే మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని... కానీ ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అనే ప్రస్తావనే లేదని అన్నారు. ఈ స్కాంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబు అని సీఎం జగన్ ఆరోపించారు. సీమెన్స్‌ సంస్థ కూడా ఈ అంశంపై ఇంటర్నెల్‌‌గా దర్యాప్తు జరిపిందని అన్నారు. ప్రభుత్వ జోవోతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్‌ చెప్పిందని అన్నారు.

AP News: అలాంటి పిల్లలపైనే ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Vizag AIrport: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.240 కోట్లతో కొత్త టెర్మినల్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

రూ. 371 కోట్లు చంద్రబాబు, ఆయన మనుషులు తీనేశారని జగన్ ఆరోపించారు. మనీలాండరింగ్‌ ద్వారా డబ్బు ఆయన చేతుల్లోకి వచ్చిందని విమర్శించారు. ఈ స్కాంపై గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు వచ్చిందని... సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకపోవడంతో జీఎస్టీ అధికారులు కూపీ లాగారని తెలిపారు. 2017లో ఈ స్కామ్‌ను జీఎస్టీ అధికారులు వెలికితీశారని... స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా క్లెయిమ్‌ చేశారని అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు