Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN MOHAN REDDY OVERTAKES TELANGANA CM KCR IN CREATING ELECTION MOOD AK

YS Jagan: కేసీఆర్‌ను మించిపోయిన జగన్.. ఎవరూ ఊహించని విధంగా.. వ్యూహమా ? భయమా ?

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

YS Jagan| KCR: అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ కూడా ఏదో ప్రత్యేకమైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని.. అవసరం, అవకాశాన్ని బట్టి ఆయన కూడా గతంలో కేసీఆర్ వెళ్లినట్టు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో మాత్రమే కనిపించిన ఈ పొలిటికల్ హీట్.. ఇప్పుడు ఏపీలోనూ పీక్స్‌కు చేరడం విశేషం. తెలంగాణలో బీజేపీ బలపడటంతో.. గులాబీ బాస్ కేసీఆర్ (KCR)  మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన తన ఆలోచనను వాయిదా వేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ ఎప్పుడైనా కేసీఆర్ తన ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ ఉన్నట్టుండి ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) స్వయంగా తమ పార్టీ నేతలను ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లారు.

    ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని.. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వాళ్లెవరినీ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే తెలంగాణతో(Telangana) పోల్చితే మరికొంత సమయం ఎక్కువగా ఉన్న ఏపీ (Andhra Pradesh) అసెంబ్లీ విషయంలో సీఎం జగన్ ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటూ జరగదని వైఎస్ జగన్ నేతలకు స్పష్టం చేశారు. అయితే రెండేళ్ల ముందుగానే ఈ రకంగా ఎన్నికల కోసం రంగంలోకి దిగాలా ? అన్నది చాలామంది వైసీపీ నేతల మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. నిజానికి ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతుంటాయి.

    ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుంటాయి. పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లి.. క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆదేశిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోందని.. అందుకే ముందుగానే ఆ కూటమిని ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    Telangana| May: టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మే నెలలో మరింత హీటెక్కనున్న రాజకీయం

    Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర రూట్‌లో మార్పులు.. అసలు కారణం ఇదే..

    అయితే అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ కూడా ఏదో ప్రత్యేకమైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని.. అవసరం, అవకాశాన్ని బట్టి ఆయన కూడా గతంలో కేసీఆర్ వెళ్లినట్టు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కారణం ఏదైనా.. తెలంగాణ అసెంబ్లీ కంటే ఎక్కువ సమయం ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్కడి అధికార పార్టీ సమాయత్తం అవుతుందని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు