Home /News /andhra-pradesh /

AP POLITICS AP CM YS JAGAN MOHAN REDDY MAY DO BUS YATRA FROM NOVEMBER OF THIS YEAR WILL MAKE ANNOUNCEMENT SHORTLY AK

YS Jagan Bus Yatra: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. నవంబర్ నుంచి బస్సుయాత్ర ?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

YS Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్లాన్ చేస్తున్న అధికార వైసీపీ.. ఆ దిశగా రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

    ఏపీలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలకు(Elections) మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నాయి. ఈ రేసులో అధికార పార్టీ కాస్త ముందే ఉందని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్లాన్ చేస్తున్న అధికార వైసీపీ.. ఆ దిశగా రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఈ ఏడాది నవంబర్ నుంచి బస్సు యాత్ర (Bus Yatra) చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం చేయనున్న వైఎస్ జగన్ దీనిపై ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది.

    పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టలేదు. పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు కరోనా విజృంభణ కూడా ఇందుకు కారణమే వాదన ఉంది. అయితే మళ్లీ సాధ్యమైనంత తొందరగా ప్రజల్లోకి వెళ్లాలనే భావించిన ఏపీ ముఖ్యమంత్రి.. తనకంటే ముందు పార్టీ నేతలందరూ గడప గడపకు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనని నేతలను సీఎం జగన్ మందలించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక తాను కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని అనుకున్న సీఎం జగన్.. ఇందుకోసం బస్సుయాత్రను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ నుంచి ఈ యాత్రను చేపట్టి.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసం ఏమీ చేశామనే విషయాలను వారికి వివరించాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.



    మరోవైపు సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టాలనే ఆలోచన వెనుక మరో కారణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అప్పుడే రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అప్పుడే జిల్లాల పర్యటనలకు బయలుదేరారు. దసరా నుంచి టీడీపీ యువనేత, మాజీమంత్రి లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారనే ప్రచారం సాగుతోంది.

    YCP Plenary 2022: ప్లీనరీలో సంచలన నిర్ణయం.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

    AP Speaker: ఏపీ స్పీకర్ తీరుపై విమర్శలు.. కోడెలకు ఒక రూల్.. తనకో రూలా అంటూ ప్రశ్నించిన తమ్మినేని

    మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పాదయాత్రగా కాకుండా మరో రూపంలో పర్యటన ఉండేలా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇలా విపక్షాలు కూడా ప్రజల్లోకి వెళుతుండటంతో.. వారికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ys jagan mohan reddy, Ysrcp

    తదుపరి వార్తలు