హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఎన్టీఆర్‌పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్ని ఆలోచించిన తరువాతే..

YS Jagan: ఎన్టీఆర్‌పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్ని ఆలోచించిన తరువాతే..

వైఎస్ జగన్, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

NTR-YS Jagan: ఎన్టీఆర్‌పై తనకు మమకారమే ఉందని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్ అనే పదమే చంద్రబాబుకు ఇష్టం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బ్రతికే ఉండేవారని.. ఆయన జీవించి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని అన్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై సీఎం జగన్ (YS Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ (NTR) అంటే తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) ఈ సవరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

  ఈ సందర్భంగా శాసన సభలో టీడీపీ సభ్యులు ఉండి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కావాలనే తమ సభ్యులతో గొడవ చేయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై తనకు మమకారమే ఉందన్నారు. ఎన్టీఆర్ అనే పదమే చంద్రబాబుకు ఇష్టం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బ్రతికే ఉండేవారని.. ఆయన జీవించి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని అన్నారు. ఇక బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి విడదల రజినీ.. రూపాయి డాక్టర్‌గా వైఎస్ఆర్ అందరికీ సుపరిచితమని తెలిపారు. ఎన్టీఆర్ మీద జగన్‌కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీల సంఖ్యను వైఎస్ఆర్ 11కు పెంచారని.. వాటిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని తెలిపారు. ఈ కారణంగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు.

  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్‌కు అర్థంకావడంలేదని తెలిపారు.

  NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  CM Jagan: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్ పేరు పెట్టమని టీడీపీ ముందుకు రావాలన్న జగన్

  టీడీపీ హయాంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్ పేరు తొలగించలేదని వెల్లడించారు. సీఎం జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, NTR

  ఉత్తమ కథలు