హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. జగన్ మారిపోయారా ?

YS Jagan: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. జగన్ మారిపోయారా ?

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆ చెప్పిన హామీలో భాగంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా బటన్ నొక్కి వర్చువల్ విధానంలో అందరికీ నగదు జమ చేయనున్నారు..

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆ చెప్పిన హామీలో భాగంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా బటన్ నొక్కి వర్చువల్ విధానంలో అందరికీ నగదు జమ చేయనున్నారు..

YS Jagan: మళ్లీ సవివరమైన, సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని చెప్పి.. అప్పుడే ఈ అంశం ముగిసిపోలేదని సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాల్లో అన్ని సమయాల్లోనూ దూకుడు పనికిరాదు. కొన్ని సమయాల్లో దూకుడుగా ముందుకు సాగడం కంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళితేనే అనుకున్నది సాధ్యమవుతుంది. ఈ విషయం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy)  కాస్త ఆలస్యంగా అర్థమైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్.. రాజకీయాల్లో దూకుడును ప్రదర్శించారు. ఆ దూకుడు కారణంగానే ఆయనకు ప్రజల్లో ఫాలోయింగ్ ఏర్పడిందనే వాదన కూడా ఉంది. ప్రజలు తనను ఈ దూకుడు కారణంగానే ఆదరిస్తున్నారని భావించిన సీఎం జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా అదే రకంగా ముందుకెళ్లి నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాజధానుల (AP Three Capitals)  ఏర్పాటు, శాసనమండలి రద్దు (Ap Legislative Council) వంటివి ఈ కోవలోకే వస్తాయని చెప్పొచ్చు.

అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఈ విషయంలో సీఎం జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదు. న్యాయపరమైన ఇబ్బందులు, ఇతర అడ్డంకులను సీఎం జగన్ ముందుకు ఊహించలేదు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. అయితే ఈ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం, ఆ మరుసటి రోజే శాసనమండలి రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి... తాజాగా ఈ విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టారనే చర్చ జరుగుతోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే ఎన్నికలు కాస్త ముందుగా వచ్చినా.. ఎదుర్కోవాలనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారని.. ఇందులో భాగంగానే ఆయన పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనూ మూడు రాజధానులకు సంబంధించి బిల్లును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ బిల్లు వెనక్కి తీసుకున్న సీఎం జగన్.. అదే సమయంలో ప్రత్యర్థులు ఇది తమ విజయం అని చెప్పుకోకుండా చేయడంలోనూ సక్సెస్ అయ్యారు.

మళ్లీ సవివరమైన, సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని చెప్పి.. అప్పుడే ఈ అంశం ముగిసిపోలేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి మూడు రాజధానుల విషయంలో చట్టసభల్లో బిల్లు లేకుండా ముందుకు సాగొచ్చని.. ఈ విషయంలో ఆయన అనవసరమైన తలనొప్పులు కొనితెచ్చుకున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇప్పుడు చట్టాలతో పని లేకుండా తన మనసులోని మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయొచ్చనే ఊహగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరు చూస్తుంటే.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉందనే టాక్ కూడా నడుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు