హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: కొడాలి నానికి మరోసారి షాక్ ఇచ్చిన జగన్ ?

Kodali Nani: కొడాలి నానికి మరోసారి షాక్ ఇచ్చిన జగన్ ?

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Kodali Nani: కొడాలి నాని ఎక్కువగా అభిమానించే ఎన్టీఆర్ పేరు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చినట్టుగా ఉందనే ఊహాగానాలు మొదలయ్యయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేయడంలో కొడాలి నాని (Kodali Nani) మిగతా వారికి కంటే ముందుంటారు. టీడీపీ, చంద్రబాబును (Chandrababu)  తనదైన శైలిలో విమర్శిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు కొడాలి నాని. మంత్రి పదవి పోయిన తరువాత కూడా కొడాలి నాని ఈ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కొడాలి నానికి సీఎం వైఎస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి ఊహించని షాక్ ఇచ్చారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రివర్గం నుంచి కొడాలి నానిని తప్పించిన సీఎం జగన్(YS Jagan).. కమ్మ సామాజికవర్గం నుంచి మరెవరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. దీంతో సీఎం జగన్‌పై టీడీపీతో పాటు కమ్మ సామాజికవర్గం నుంచి విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు.

  మరోవైపు మంత్రివర్గంలో చోటు లేకపోయినంత మాత్రాన కమ్మ సామాజికవర్గానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని కొడాలి నాని కూడా చెప్పుకొచ్చారు. అయితే కొడాలి నాని ఎక్కువగా అభిమానించే ఎన్టీఆర్ పేరు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చినట్టుగా ఉందనే ఊహాగానాలు మొదలయ్యయి.

  తాను ఎన్టీఆర్ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని కొడాలి నాని పదే పదే చెబుతుంటారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కే ఎక్కువ అభిమానం ఉందని.. అందుకే ఏపీలోని కొత్త జిల్లాకు ఆయన పెట్టారని పదే పదే చెబుతుంటారు. అయితే తాజాగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై కొడాలి నాని ఇంకా స్పందించలేదు.

  YS Jagan: ఎన్టీఆర్‌పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్ని ఆలోచించిన తరువాతే..

  NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  ఈ విషయంలో కొడాలి నాని ఏం మాట్లాడినా.. ఆయనపై టీడీపీ రాజకీయ దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై పునరాలోచన చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. దీంతో కొడాలి నాని ఈ అంశంపై ఏ రకంగా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kodali Nani, NTR

  ఉత్తమ కథలు